Begin typing your search above and press return to search.

ఆమెకు జైలు ఖాయమంటున్న ట్రంప్

By:  Tupaki Desk   |   5 Jun 2016 12:16 PM IST
ఆమెకు జైలు ఖాయమంటున్న ట్రంప్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. అమెరికా అధ్యక్ష పదవికి ఫైనల్ అభ్యర్థుల్ని అధికారికంగా ఎంపిక పూర్తి కానప్పటికీ.. రిపబ్లికన్ల తరఫున డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ల తరపున హిల్లరీక్లింటర్ అన్న విషయం దాదాపుగా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇరువుర మధ్య మాటల దాడి రోజురోజుకీ తీవ్రమవుతోంది. నిన్నటికి నిన్న హిల్లరీకి జత కలిసి అమెరికా అధ్యక్షుడు ఒబామా సతీమణి మిచెల్లీ.. ట్రంప్ మీద తీవ్ర విమర్శలు చేయటం తెలిసిందే.

ట్రంప్ కారణంగా అమెరికా పరపతి నాశనం కావటంతో పాటు.. ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయితే నియంతగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ట్రంప్ సైతం నోరు విప్పారు. తన ప్రత్యర్థిగా భావిస్తున్న హిల్లరీ క్లింటన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రధాన పోటీదారుగా భావిస్తున్న హిల్లరీ క్లింటన్ కు జైలు తప్పదని స్పష్టం చేస్తున్నాడు.

ఈ మొయిల్ కుంభకోణంలో ఆమె జైలులకు వెళ్లటం ఖాయమని చెప్పాడు. కాలిఫోర్నియాలో తన మద్దుతుదారులతో సమావేశమైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ హిల్లరీ మీద ఈ మొయిల్ ఆరోపణల్ని చేసినప్పటికీ.. తాజాగా తీవ్రస్థాయిలో మండిపడటం చూసినప్పుడు ఈ మొయిల్ ఆరోపణల విషయంలో హిల్లరీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అన్న సందేహం కలగటం ఖాయం. ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై హిల్లరీ పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.