Begin typing your search above and press return to search.
ట్రంప్ కు కరోనా వచ్చిందన్న వేదనతో బుస్సా మరణించాడు
By: Tupaki Desk | 12 Oct 2020 10:30 AM ISTఎక్కడ అమెరికా. ఎక్కడ జనగామ జిల్లాలోని కొన్నె గ్రామం. అభిమానానికి ఎల్లలు ఉండవన్న విషయం ఆ గ్రామానికి చెందిన బుస్సా క్రిష్ణను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను విపరీతంగా అభిమానించే ఈ 31 ఏళ్ల యువకుడు తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటాడు. ట్రంప్ ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అతగాడు.. తాజాగా ట్రంప్ నకు కరోనా సోకిందన్న ఆందోళనకు గురై మరణించటం గమనార్హం.
ట్రంప్ కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన ఇతడు.. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడగా ఎన్నికవుతారన్న నమ్మకంతో ఉంటారు. ట్రంప్ మీద ఉన్న అభిమానంతో అతడికి విగ్రహాన్ని ఏర్పాటు చేసి... తన ఇంటివద్దే పెట్టుకున్నారు. కొన్నేళ్ల క్రితం క్రిష్ణ భార్య మరణించింది. అతినికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు.
తన జీవితంలోఎప్పుడైనా ట్రంప్ ను కలవాలన్నదే ఆయన కోరిక. ఇటీవల ట్రంప్ కు కరోనా పాజిటివ్ రావటం..అతని ఆరోగ్యం సీరియస్ గా ఉన్నట్లు వార్తలు రావటంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. దీంతో మనోవేదనకు గురైన అతడు.. తాజాగా గుండెపోటుతో మరణించిన వైనం షాక్ ను ఇస్తోంది. ట్రంప్ మీద బుస్సా క్రిష్ణ అభిమానం ఇంత భారీగా ఉంటుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. చిన్న వయసులోనే ఆయన మరణించటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.