Begin typing your search above and press return to search.

తూచ్.. నే కామెడీకి అన్నా.. తిక్క ట్రంప్ కవరింగ్

By:  Tupaki Desk   |   26 April 2020 4:10 PM IST
తూచ్.. నే కామెడీకి అన్నా.. తిక్క ట్రంప్ కవరింగ్
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. స్వతహాగానే బాగా షార్ట్ టెంపర్ కలిగిన వ్యక్తి. నోటి దురుసు ఎక్కువ. తనను ప్రశ్నించే విలేకరులపై చాలా సార్లు నోరుపారేసుకున్నారు. ట్రంప్ విలేకరుల సమావేశంలో ఒక్క విలేకరి అయినా ఆయన ఆగ్రహానికి గురవుతుంటారు. అలాంటి తిక్క ట్రంప్ తాజాగా కరోనాపై నోరుజారి చిక్కుల్లో పడ్డారు. అమెరికన్ ప్రజలు, పార్టీలు, చివరకు సొంత పార్టీ వారు కూడా ఆయన తీరును తప్పుపట్టేసరికి నాలుక కరుచుకొని తూచ్.. తాను కామెడీకి అన్నానని కవర్ చేసుకున్నాడు. ఇంతకీ ట్రంప్ ఏమన్నాడంటే?

అమెరికాలో కరోనా తీవ్రంగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. దాన్ని కంట్రోల్ చేయలేక ట్రంప్ లో అసహనం పెరిగిపోతోంది. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడంతో ఆయనలో అసహనం పెరిగిపోతోంది. తాజాగా ట్రంప్ ‘కరోనాను అదుపుచేయాలంటే శరీరంలోకి క్రిమి సంహారక మందులు ఎక్కించాలంటూ’ అర్థరహిత వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ సభ్యులు సైతం ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దుమారం చెలరేగడంతో ట్రంప్ తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను చేశాడు. ‘తాను కామెడీకి అన్నానని సీరియస్ గా వాటిని తీసుకోవద్దని.. లైట్ గా తీసుకోండి’ అని కవర్ చేశారు.

ఇలా ట్రంప్ ప్రతీసారి నోరుజారడం.. చివరకు సరిచేసుకోవడం అలవాటుగా మారింది. ఆయనను అందుకే అందరూ తిక్క ట్రంప్ అనే వారు కూడా లేకపోలేదు. అయినా ట్రంప్ మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు.