Begin typing your search above and press return to search.

కరోనాను తక్కువ అంచనా వేశా.. వాస్తవాన్ని అంగీకరించిన ట్రంప్ !

By:  Tupaki Desk   |   10 Sep 2020 3:30 PM GMT
కరోనాను తక్కువ అంచనా వేశా.. వాస్తవాన్ని అంగీకరించిన ట్రంప్ !
X
కరోనా వైరస్ గురించి ప్రపంచమంతా గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చివరికి వాస్తవాన్ని అయితే అంగీకరించారు. అమెరికాలో ఫస్ట్ కరోనా పాజిటివ్ కేసు జనవరి 21న బయటపడింది. మహమ్మారిలా మారే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ట్రంప్ చెవిలో పోరు పెట్టాయి. అయినా ట్రంప్ అంతా బాగానే ఉందన్నారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ....ఇది అల్లాటప్పా వ్యాధి, నాలుగు రోజులు ఉండి పోతుందని అనుకున్నానని, కానీ నిజానికి ఇది భయంకరమైనదేనని అన్నారు. దీన్ని పెద్ద బూచిగా చూపి హడావుడి చేస్తే, అమెరికన్లలో భయాందోళనలు తలెత్తుతాయని. ఇక మహమ్మారి గురించి చెప్పేదేముందన్నారు.

ఈ దేశానికి నేను ఛీర్ లీడర్ని.. ఈ దేశాన్ని ప్రేమించేవాడ్ని, ప్రజలు భయపడకూడదని భావించే, భీతావహ పరిస్థితిని సృష్టించరాదన్నదే నా ఉద్దేశం అని అన్నారు. ఈ వైరస్ మన ఫ్లూ కన్నా భయంకరమైనది.. అని మొత్తానికి ఒప్పుకొన్నారు. బాబ్ వుడ్ వర్డ్ న్యూ బుక్ రేజ్ కి ఆ మధ్య ఇఛ్చిన ఇంటర్వ్యూ లో ట్రంప్ ఈ విషయాలన్నీ చెప్పారు. ఈ బుక్ కోసం ఆయన 18 ఇంటర్వ్యూలు ఇవ్వడం విశేషం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరో రెండు మాసాల్లో నవంబరు 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజానాడిని కనుగొనేందుకు నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్స్‌లో అత్యధికులు డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వైపే మొగ్గుచూపారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కంటే జో బైడెన్ 12 శాతం ఎక్కువ ఓట్లు సాధించినట్లు ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ప్రస్తుతం ఓటర్ల అభిప్రాయం మేరకు డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ఆ సర్వే తేటతెల్లం చేస్తోంది. దీంతో రెండోసారి అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరే అవకాశాలు తక్కువేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సర్వే ఫలితాలు డెమొక్రాటిక్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.