Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్.. నమస్తేను నేర్చేసుకుంటున్న ప్రపంచం
By: Tupaki Desk | 13 March 2020 3:15 PM ISTనమస్కారం.. భారత సంస్కృతికి నిలువెత్తు రూపం. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా.. ప్రపంచానికి చెందిన పలువురు నేతలు.. సెలబ్రిటీలు భారతగడ్డ మీద కాలు మోపిన వెంటనే.. నమస్కారానికి అతి కష్టమ్మీద పెట్టటం నేర్చుకుంటారు. అదేం సిత్రమో కానీ.. కరోనా పుణ్యమా అని.. ప్రపంచాధినేతలు మొదలు.. ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరూ నమస్కారాన్ని నేర్చుసుకుంటున్నారు.
ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా షేక్ హ్యాండ్లు.. హగ్ లు.. మెడ పక్కన సున్నితంగా ముద్దులు పెట్టుకోవటం ద్వారా.. ఒకరినొకరు పలుకరించుకునే విధానానికి స్వస్తి చెప్పేస్తున్న వారు.. ఇప్పుడు కాస్త దూరంగా రెండు చేతులు జోడించి.. నమస్కారం పెట్టేస్తున్నారు. నమస్కారంతో సంస్కారమని మనం చెప్పుకుంటే.. ఎదుటోడికి చేతులు కలపటం ఇష్టం లేకనే ఇలా చేస్తారంటూ విమర్శలు చేసే వారు లేకపోలేదు.
అయితే.. కరోనా భయంతో ఒకరినొకరు ముట్టుకోకుండా.. ఆ మాటకు వచ్చే టచ్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నమస్కారాలతో సరి పెడుతున్నారు. తాజాగా ఐర్లాండ్ అధ్యక్షుడు లియో వాడార్కర్ అమెరికా అధినేత ట్రంప్ ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ షేక్ హ్యాండ్ కు బదులుగా.. నమస్కారంతో సరిపెట్టారు. ఇదే విషయాన్ని మీడియాకుచెప్పారు. ఈ మధ్యనే తాను ఇండియా వెళ్లి వచ్చానని.. అక్కడ కూడా తానెవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని.. అందరికీ నమస్కారం చేసినట్లుగా చెప్పటం గమనార్హం.
భారతదేశాన్ని వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్లు భారత సంపదను తమ వెంట తీసుకెళ్లారే కానీ.. మన సంప్రదాయాన్ని మాత్రం వారు తీసుకెళ్లలేదు. కరోనా పుణ్యమా అని.. భారత సంస్కృతిని రాత్రికి రాత్రే నేర్చుసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాణి ఎలిజబెత్ 2 కుమారుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛార్లెస్ అందర్నీ దండంతో పలుకరిస్తుండటం విశేషం. తాజాగా ఆయన లండన్ లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అలవాటులో పొరపాటుగా షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు చాచి.. ఆ వెంటనే గుర్తుకు రావటం.. చేతిని వెనక్కి తీసుకొని దండంతో సరిపెట్టారు. ఇలా రెండుమూడు సార్లు జరిగిన తర్వాత.. అందరికి దండం పెడుతూ.. గాడిలో పడ్డారు.
ఇక.. నమస్కారాన్ని అలవాటు చేసుకోవటమే కాదు.. దేశ ప్రజలంతా షేక్ హ్యాండ్ కు బదులుగా నమస్కారాలు చేసుకోవాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రజల్ని కోరారు. కరోనాకు దూరంగా ఉండేందుకు ఈ అలవాటు తప్పనిసరి అని చెప్పారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. స్పెయిన్ రాజు ఫిలిప్ 6 దంపతులు కలిశారు. ఈ రెండు జంట ఒకరినొకరు దండంతో సరిపెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది.