Begin typing your search above and press return to search.

అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 502 కోట్లు !

By:  Tupaki Desk   |   10 Oct 2020 5:31 PM GMT
అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 502 కోట్లు !
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి డబ్బు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టేస్తున్నారట. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్, జో బైడెన్‌లు జూన్‌ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్‌ 13వ తేదీ వరకు, మొత్తం 105 రోజుల్లో ఒక్క సోషల్‌ మీడియాకు ఇద్దరు సంయుక్తంగా ఇచ్చిన అండ్వర్టయిజ్‌ మెంట్ల పైనే ఏకంగా 68.8 మిలియన్‌ అమెరికా డాలర్లు (దాదాపు 502 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వారు ఆగస్టు పదవ తేదీ నుంచి సెప్టెంబర్‌ 13వ తేదీ మధ్యనే 40 శాతం సొమ్మును, అందులోనూ ఎక్కువగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపైనే ఖర్చు చేశారని సైరాక్యూస్‌ యూనివర్శిటీ ఓ అధ్యయనంలో వెలుగులోకి తీసుకువచ్చింది.

ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్‌ 13 మధ్య, నెలరోజుల్లో ఆన్‌ లైన్‌ యాడ్స్‌ కు 27 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారని తెలిపింది. 2016 సంవత్సరంలో డోనాల్డ్‌ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌ పోటీ పడినప్పుడు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఖర్చు పెట్టారని యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. అధ్యక్ష ఉన్నికల్లో పోటాపోటీగా యాడ్స్‌ కోసం ఖర్చు పెడుతున్న ట్రంప్, బైడెన్‌లు అందులో 70 శాతం నిధులను కేవలం ఓటర్లను ఆకర్షించేందుకు ఖర్చు పెడుతుండగా, 30 శాతం నిధులను ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడే ఓటర్లను సమీకరించేందుకు ఖర్చు పెడుతున్నారు.

అమెరికాలో టీవీలో యాడ్‌ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవడం వల్ల ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు కూడా సోషల్‌ మీడియాకే ఎక్కువ యాడ్స్‌ ఇస్తున్నారు. అమెరికాలో ప్రింట్, రేడియో, బిల్‌బోర్డు యాడ్‌లు చాలా తక్కువ. అయితే అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం యాడ్స్‌కు ఖర్చు పెట్టే సొమ్ములో కేవలం 5 శాతం మాత్రమే ఈ మూడు మీడియాలపై ఖర్చు పెడతారట. డోనాల్డ్‌ ట్రంప్‌ పురష ఓటర్లు లక్ష్యంగా ఎక్కువ యాడ్స్‌ ఇస్తుండగా, అందుకు భిన్నంగా బైడెన్‌ మహిళా ఓటర్లు లక్ష్యంగా ఎక్కువ యాడ్స్‌ ఇస్తున్నారు.