Begin typing your search above and press return to search.

ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   17 July 2019 4:37 PM IST
ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్
X
అమెరికాయే ఫస్ట్ ఆ తర్వాతే విదేశీయులు అని కఠిన చట్టాలు తెస్తున్న ట్రంప్ వైఖరి ప్రపంచవ్యాప్తంగా వలసవాదులకు షాకింగ్ లా మారింది. ట్రంప్ వచ్చాక అమెరికాలో ఇతర దేశస్థుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఇప్పుడు భారత ఐటీ నిపుణులకు ట్రంప్ సర్కారు తాజాగా శుభవార్త చెప్పింది. వలస విధానంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది.

అమెరికా తాజాగా గ్రీన్ కార్డుల విషయంలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిభ ఆధారంగా ఉద్యోగులకు ఇచ్చే గ్రీన్ కార్డుల కోటాను 12 శాతం నుంచి ఏకంగా 57శాతానికి పెంచేందుకు సిద్ధమై సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్రంప్ సీనియర్ అడ్వైజర్ జారెడ్ వైట్ హౌస్ లో కేబినెట్ మీటింగ్ అనంతరం ప్రకటన చేశారు. ఈ ప్రకటన భారతీయ టెకీల పంట పండించింది.

ఈ కొత్త గ్రీన్ కార్డుల విధానంలో ప్రతిభ ఉన్నవారు గ్రీన్ కార్డులు పొందే అవకాశం ఉంటుంది. వారికి మంచి ఉద్యోగం.. జీతాలు దక్కుతాయి. ప్రతిభ ఆధారంగా నియమాకాలు ఇన్నాళ్లు అమెరికాలో కేవలం 12 శాతం ఉండగా.. దీన్ని 57శాతానికి ట్రంప్ ఇప్పుడు పెంచారు.

ఐదున్నర దశాబ్ధాల తర్వాత ట్రంప్ వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఇప్పటికే కెనడా దేశం ప్రతిభ ఆధారంగా వలసలకు 53శాతానికి పెంచారు. జపాన్ 22శాతం - ఆస్ట్రేలియా 63 - న్యూజిలాండ్ 59శాతం పెంచారు. ప్రస్తుతం అమెరికా సంస్కరణల వల్ల నైపుణ్యం కలిగిన యువతకు అవకాశాలు వెల్లువెత్తుతాయి. వేలాది మంది ఇండియన్ టెకీలకు మేలు జరగనుంది.