Begin typing your search above and press return to search.

ఇదేంటయ్యా.. మోకాలి లోతులో నీరు.. చేతిలో డోమినో పిజ్జా!

By:  Tupaki Desk   |   15 May 2021 5:30 AM GMT
ఇదేంటయ్యా.. మోకాలి లోతులో నీరు.. చేతిలో డోమినో పిజ్జా!
X
సామాజిక మాధ్యమాలు సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చేస్తాయి. ఓవర్ నైట్ లో ఓ స్టార్ ను అంతేస్థాయిలో కిందకు పడేయగలదు. ఇటీవల వీటికి చాలా డిమాండ్ పెరిగింది. పలు కంపెనీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు. వారు చేసే అతి చిన్న విషయాన్ని సైతం నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఒకవేళ క్లిక్ అయితే లక్షలు పెట్టినా దొరకని ప్రచారం లభిస్తుంది కదా.

ఒక్కోసారి ఈ ప్రచార యావ బెడిసికొడుతుంది. ఏదో అనుకుంటే మరేది జరిగి... లేనిపోని తంటాలు తెచ్చిపెడుతుంది. ప్రముఖ పిజ్జా కంపెనీ డోమినో విషయంలో అదే జరిగింది. ఆ కంపెనీ ట్వీట్ ఒకటి నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. జలమయమైన రోడ్లలో ఆ కంపెనీ డెలివరీ బాయ్ పిజ్జాలు సరఫరా చేస్తున్నారు. మే 12న పశ్చిమ బంగలో మోకాలి లోతు నీటిలో.. ఓ చేతిలో పిజ్జా ఆర్డర్ పట్టుకుని వినియోగదారుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ డెలివరీ బాయ్ పేరు షోవోన్ ఘోష్. ఈ ఫొటోను నెటిజన్లతో పంచుకుంటూ ఆ సంస్థ రాసిన సందేశం వివాదాస్పదం అయింది.

'సైనికుడు ఎప్పుడూ విధి నుంచి తప్పించుకోరు. కోల్కత్తా వర్షాలు కురిసిన వేళ మా ప్రతినిధి రుచికరమైన, ఆరోగ్యవంతమైన భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. ఆ పదార్థాలు మిమ్మల్ని శక్తిమంతం చేస్తాయి. నీల రంగు చొక్కాలో మోకాలి నీటితో నిల్చున్న మా ప్రతినిధి సేవకు మేము వందనం చేస్తున్నామంటూ' క్యాప్షన్ పెట్టింది. ఈ మాటలే నెటిజన్లకు కోపం తెప్పించాయి.

తమ సిబ్బంది ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అనే ఉద్దేశంతో పెట్టిన ఆ పోస్ట్ కాస్త బెడిసి కొట్టింది. 'ఇది అమానవీయ చర్య, ఇందులో గర్వపడడానికి ఏమీ లేదంటూ' ఓ నెటిజన్ పెదవి విరిచారు. 'మీరు చాలా మంచి పని చేశారు. కానీ మేను ఆ వ్యక్తని మాత్రమే గౌరవిస్తున్నా. డొమినోని కాదు' అంటూ పోస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అతడితో పనిచేయించుకోవడం నిజంగా పని దోపిడి అంటూ మరో వ్యక్తి ఆ కంపెనీకి చురకలు అంటించారు. ఈ పోస్ట్ తో మొత్తానికి డొమినోకు ఏదో అనుకుంటే ఏదో జరిగినట్లుగా ఉంది.