Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాలో డామినేష‌న్ ఆ క్యాస్ట్‌ల‌దే...

By:  Tupaki Desk   |   24 Oct 2019 6:47 AM GMT
సోష‌ల్ మీడియాలో డామినేష‌న్ ఆ క్యాస్ట్‌ల‌దే...
X
ప్రస్తుతం ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తోంది. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేసిన సోషల్ మీడియా ప్రభావం మామూలుగా లేదు. ఏ విషయంలో అయినా సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలకు ప్రజలు బాగా ఎడిక్ట్‌ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు మీడియాలో ఏం చెబితే అదే వేదం అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో ఎవరికి వారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునే వీలు చిక్కింది. దీంతో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఎవ‌రు ఎలా ? స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ఎక్కువగా ఏ కులాలు స్పందిస్తున్నాయి అనే అంశంపై ఢిల్లీకి చెందిన లోక్‌నీతి అండ్ సెంటర్‌ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్‌ సొసైటీస్( సీఎస్‌డీఎస్‌) అనే సంస్థ జర్మన్‌కు చెందిన మరో సంస్థతో కలిసి సర్వే నిర్వహించింది. సోషల్ మీడియా అండ్ పొలిటికల్ బిహేవియర్ పేరుతో రిపోర్టును సైతం వెల్ల‌డించింది.

తాజా సర్వే రిపోర్టు ప్రకారం దేశంలో మిగిలిన కులాల కంటే అగ్రవర్ణాల వారే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్టు స్పష్టమైంది. అగ్రకులాలకు చెందిన యూజ‌ర్లు పలు అంశాలపై ఎక్కువగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని కూడా సర్వే కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఓవరాల్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యూజ‌ర్లలో 15 శాతానికి పైగా అగ్రవర్ణాల వారు ఉంటున్నట్టు తేలింది. మిగిలిన వారిలో ద‌ళితులు ఎనిమిది శాతం... గిరిజనుల్లో 7 శాతం మంది యూజర్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు.

ఇక బీసీల్లో 9 శాతం మంది సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉంటునట్టు సర్వే తేటతెల్లం చేసింది.ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే దేశంలోనే సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్న పార్టీల్లో బిజెపి అగ్రస్థానంలో నిలిచింది. బిజెపి దేశంలో బలోపేతం కావడానికి ప్రధాన కారణాలలో సోషల్ మీడియా ఒకటిగా ఈ సర్వే గుర్తించింది. వాస్తవంగా కూడా 2014 ఎన్నికలకు ముందు నుంచే సోషల్ మీడియా ప్రభావం గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అప్పటినుంచే పార్టీ ప‌రిధిని సోషల్ మీడియా పరంగా చాలా విస్తృత పరచారు.

ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి మరి బిజెపి మిగిలిన పార్టీలకు అందకుండా దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాజకీయంగా తిరుగులేని శక్తిగా ఎదగడంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉందని సర్వే స్పష్టం చేసింది. ఇక ఈ విషయంలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ చాలా ఆలస్యంగా మేల్కొంది. గత రెండు సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పరిధిని పెంచే ప్రయత్నం చేసినా బిజెపితో పోలిస్తే కాంగ్రెస్ చాలా చాలా వీక్ గా ఉందని చెప్పాలి.