Begin typing your search above and press return to search.

ప్ర‌కాశం టీడీపీలో క‌మ్మ నేత‌ల అంత‌ర్యుద్ధం!

By:  Tupaki Desk   |   24 Nov 2020 11:00 AM IST
ప్ర‌కాశం టీడీపీలో క‌మ్మ నేత‌ల అంత‌ర్యుద్ధం!
X
ప్ర‌కాశం జిల్లా టీడీపీలో కీల‌క‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌ల మ‌ధ్య అంత‌ర్యుద్ధం జ‌రుగుతోంద‌నే వార్త లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే.. దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌.. టీడీపీకి జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంతా ఈయ‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవి. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో జిల్లా రాజ‌కీయాల్లో జ‌నార్ద‌న్ బాగానే చ‌క్రం తిప్పారు. అంతేకాదు.. అద్దంకి లో వైసీపీ త‌ర‌ఫున 2014లో విజ‌యం సాధించిన గొట్టిపాటి ర‌వినిపార్టీలోకి తీసుకురావ‌డం వెనుక దామ‌చ‌ర్ల ఉన్నార‌నే ప్ర‌చారం ఉంది.

అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌నార్ద‌న్‌.. ఒంగోలులో ఓడిపోయారు. అదేస‌మ‌యంలో జిల్లాలో నాలుగు చోట్ల పార్టీ విజ‌యం సాధించింది. చీరాల‌, అద్దంకి, కొండ‌పి ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ దూకుడు ను క‌ట్టిపెట్టి మ‌రీ.. టీడీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ఈ క్ర‌మంలో దామ‌చ‌ర్ల చేసిన క‌ష్ట‌మే .. పార్టీని గెలిపిం చింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ప‌రిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. ప‌రుచూరులో ఏలూరి సాంబ‌శివ‌రావు.. దూకుడు కార‌ణ‌మే ప‌నిచేసింద‌నేది టీడీపీ అంచ‌నా. ఇక‌, కొండ‌పి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ బాల వీరాంజ‌నేయ ప‌నితీరుకే ప్ర‌జ‌లు ఓటేశార‌ని పార్టీ అంచ నాకు వ‌చ్చింది.

అద్దంకిలో ర‌వి రాజ‌కీయాలు క‌లిసివ‌చ్చాయి. ఎటొచ్చీ.. చీరాల‌లోనూ జ‌నార్ద‌న్ హ‌వా క న్నా.. ఆమంచి వ్య‌తిరేక‌త పార్టీకి క‌లిసి వ‌చ్చింద‌ని భావిస్తున్నారు. దీంతో ఎవ‌రికి వారు మ‌రీ ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంలో త‌మ త‌మ రాజ‌కీయాలు చేసుకుంటున్నారు. ఎవ‌రిని ఎవ‌రూ లెక్క చేయ‌డం లేదు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌యటి వారు వేలు పెడుతున్నారు. ఇక‌, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క‌మ్మ వ‌ర్గానికి చెందిన త‌మ్ముళ్లు.. ఆధిప‌త్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌కాశం టీడీపీలో అంత‌ర్యుద్ధం ఆన‌వాళ్లు అమ‌రావ‌తి వ‌ర‌కు వినిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ ప‌రిణామాల‌తో జిల్లా పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని దామ‌చ‌ర్ల డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఈయ‌న సోద‌రుడు స‌త్య‌.. వైసీపీకి అంత‌ర్గ‌త బంధువుగా మారిపోయార‌ని.. వైసీపీ అనుబంధ నాయ‌కుడిగా ప‌నిచేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం టీడీపీ ప‌య‌నం ఎటు? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.