Begin typing your search above and press return to search.

దెయ్యంతో ప్రాంక్ వీడియోలు .. పోలీసులు ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   12 Nov 2019 12:56 PM IST
దెయ్యంతో ప్రాంక్ వీడియోలు .. పోలీసులు ఏంచేశారంటే ?
X
ఈ మధ్య కాలంలో ప్రాంక్ వీడియోల హావ బాగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ దేశం మొత్తం నడుస్తుంది. కానీ , ప్రాంక్ వీడియోలని కొందరు నవ్వు కోవడానికి చేస్తుంటే మరికొందరు మాత్రం విచిత్రమైన వేషధారణలతో అందరిని భయపెడుతున్నారు. సరదాకి చేసే ప్రాంక్ వీడియోలతో ఏమి జరగదు..కానీ , ప్రాంక్ వీడియోల పేరిట అర్ధరాత్రిళ్ళు చిత్రవిచిత్రమైన యాక్ట్స్‌తో ప్రజలను కొంతమంది భయపెడుతున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ప్రాంక్ వీడియోలు తీసేవారి ఆటలని ఎక్కడికక్కడ అరికడుతున్నారు.

తాజాగా బెంగుళూరు సమీపంలోని యశ్వంత్‌పురలో దెయ్యం వేషధారణలో అర్థరాత్రి రోడ్లపైకి వచ్చి...ఆ రోడ్ల పై వచ్చిపోయేవారిని భయపెడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తోన్న పోకిరీల ఆటకట్టించారు అక్కడి పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. యశ్వంత్‌పుర సమీపంలోని షరీఫ్‌నగర్‌కు చెందిన కొందరు వ్యక్తులు యూట్యూబ్‌ ప్రాంక్‌ వీడియోలు చేయడం ప్రారంభించారు. ఈక్రమంలో వారు దెయ్యం వేషాధారణలో పెద్ద గోళ్లు, తెల్ల గౌన్లు, రక్తపు మరకలతో రోడ్లపైకి వచ్చి ప్రజలను భయపెట్టి వారి హావభావాలను వీడియోలు తీస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు వచ్చిపోయేవారిని భయపెడుతూ వారి హావభావాలను షూట్ చేస్తున్నారు. ప్రయాణం హాడావిడిలో వెళ్తున్నవారు వీరిని చూసి ఒక్కసారిగా షాక్‌ గురై యాక్సిడెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయమై కొందరు స్థానికులు వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిలో ఏడుగురిని గుర్తించి అరెస్టు చేశారు. ఒకరి మొబైల్‌లో పలు ప్రాంక్ వీడియోలు సైతం గుర్తించారు. అరెస్టయిన వారిలో 18 నుంచి 25 మధ్య వయసున్న యువకులే ఉన్నారు. వారు ప్రాంక్‌ వీడియోలే చేయాలనుకున్నారు.. కానీ చేసిన విధానం చాలా ప్రమాదకరంగా ఉండటం తోనే వారిని అరెస్ట్ చేస్తునట్టు పోలీసులు తెలిపారు. ప్రతిదానికి హద్దులుంటాయని ..ఆ హద్దులకి లోబడి ఎవరి పని వారు చేసుకుంటే మంచిది అంటూ హెచ్చరించారు.