Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్​ పనిచేస్తుందా అసలు..! రెండో డోసు తీసుకున్నా కరోనా..!

By:  Tupaki Desk   |   21 March 2021 10:30 AM GMT
వ్యాక్సిన్​ పనిచేస్తుందా అసలు..! రెండో డోసు తీసుకున్నా కరోనా..!
X
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే ఫ్రంట్​ లైన్​ వారియర్స్​కు వ్యాక్సినేషన్​ పూర్తయ్యింది. రెండో దశ పంపిణీ కొనసాగుతున్నది. మరోవైపు ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు ఈ వ్యాక్సిన్​ పనిచేస్తుందా? లేదా? అన్న అనుమానము కలుగుతోంది.

ఎందుకంటే రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా చాలా మందికి కరోనా సోకుతుంది. రెండు డోసుల వ్యాక్సినేషన్​ పూర్తయ్యాక దాదాపు 15 రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.. అయినప్పటికీ కొందరిలో కరోనా పాజిటివ్​ రావడం ఆందోళన కలిగిస్తున్నది. ​

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్నది.

మహారాష్ట్ర, కర్ణాటకలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఓ వైపు వ్యాక్సినేషన్​ కొనసాగుతుండటం... వాక్సిన్​ తీసుకున్న వాళ్లలోనూ కరోనా పాజిటివ్​ వస్తుండటంతో ఆందోళన నెలకొన్నది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్​ తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. కరోనా వ్యాక్సిన్ మొదటి, రెండో డోసు తీసుకున్న కొందరికి మళ్లీ కరోనా పాజిటివ్ రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఖమ్మం అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఆరుగురికి పాజిటివ్‌ తేలడంతో కలకలం రేగింది. వీరితో పాటు రఘునాథపాలెం పోలీసుస్టేషన్‌లోనూ ఒక కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. మరికొన్ని స్టేషన్లలోనూ కరోనా భయంతో ఎవరికివారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఇటీవల శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న పలువురు పోలీసులకు కరోనా సోకింది. వారు గతంలోనే కరోనా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా సోకడం ఆందోళన కలిగిస్తున్నదని అధికారులు అంటున్నారు.