Begin typing your search above and press return to search.

వామ్మో..! కరోనా ఇలా కూడా అంటిస్తున్నారా? పెద్దోళ్లో టార్గెట్​!

By:  Tupaki Desk   |   22 Nov 2020 5:40 PM IST
వామ్మో..! కరోనా ఇలా కూడా అంటిస్తున్నారా? పెద్దోళ్లో టార్గెట్​!
X
ఉగ్రవాదులు ఆకస్మాత్తుగా దాడులు జరపడం, కాల్చి చంపడం చూస్తుంటాం. ప్రభుత్వ అధినేతలు, ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేయడం వింటుంటాం. రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబులు పెట్టి జనాలను బలిగొనడం ఎన్నో సార్లు చూశాం. ఇప్పుడున్న కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్న ఉగ్రవాదులు సరికొత్త కుట్రకు తెరలేపారు. యావత్​ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో మరో షాకింగ్​ నిజం బయటపడింది. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా కరోనాను వ్యాపింపజేస్తున్నట్టు ఇంటర్​పోల్​ గుర్తించింది. పెద్ద పెద్ద రాజకీయనాయకులు, సెలబ్రిటీలే టార్గెట్​గా ఉగ్రవాదులు ఈ కొత్త కుట్రకు తెరలేపినట్టు వార్తలు వస్తున్నాయి.

లేఖలు, పార్శిళ్లలో కరోనా వైరస్​ను అంటించి వాటిని రాజకీయనేతలకు చేరవస్తున్నట్టు ఇంటర్​పోల్​ గుర్తించింది. కరోనా వైరస్‌తో కలుషితం చేసిన లేఖలను, పార్శిళ్లను పంపిస్తున్నట్టు ఇంటర్​పోల్​ అనుమానిస్తున్నది. ఈ పార్సిళ్ల ద్వారా ఎలాగైనా కరోనా అంటించాలన్నది వాళ్ళ ప్లాన్.
పోలీసులు, నిఘా, భద్రతా అధికారులు, డాక్టర్లకు దగ్గరకు కొందరు కరోనా రోగులను పంపించి వాళ్ళ నోటినుంచి తుంపర్లు పడేలా చేస్తున్నారట.

ఇంటర్‌పోల్ (International Criminal Police Organisation) ఈ మేరకు అన్ని దేశాలను హెచ్చరించింది.

కొందరు దుండగులు, ఉగ్రవాదులు ఇటువంటి చర్యలకు స్కెచ్​ వేస్తున్నారని ఇంటర్​పోల్​ నిఘాలో బయటపడింది. డాక్టర్లు, రాజకీయనాయకులను టార్గెట్​ చేసుకొని వారిని కరోనాను అంటించాలని ఉగ్రవాదులు స్కెచ్​ వేశారట.అయితే అన్ని దేశాలకు చెందిన పోలీసులు ఈ విషయంపై జాగ్రత్తగా ఉండాలని ఇంటర్​పోల్​ సూచించింది. ప్రతిఒక్కరిని క్షణ్ణంగా తనిఖీ చేయాలని వారు సూచిస్తున్నారు. పదవుల్లో ఉన్న రాజకీయనాయకులను ఎవరెవరు కలుస్తున్నారో తెలుసుకొని వారికి పరీక్షలు నిర్వహించాలని ఇంటర్​పోల్​ సూచిస్తున్నది.