Begin typing your search above and press return to search.
జగన్ పై ఒత్తిడి పనిచేస్తుందా ?
By: Tupaki Desk | 4 Nov 2021 11:10 AM ISTజగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెంచాలని ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ పై ఒత్తిడి పెంచాలని జనసేన, బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న వైజాగ్ లో స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజుల గడువిచ్చారు.
తాజాగా బీజేపీ ఎంఎల్సీ మాధవ్ మాట్లాడుతూ జగన్ గనుక ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళినట్లయితే తాము కూడా వెంటవస్తామని చెప్పారు. అంటే కమలనాథులు తమ ఫెయిల్యూర్ ను జగన్ కు అంటకడదామని ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. ఎందుకంటే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తు ఇప్పటికే జగన్ ప్రధానమంత్రికి రెండు లేఖలు రాశారు. నష్టాల్లో ఉన్న సంస్ధను ఎలా గట్టెక్కించాలో కూడా జగన్ తన లేఖల్లో స్పష్టంగా చెప్పారు. పార్లమెంటులో ఎంపీలు మాట్లాడారు. ఏపీ భవన్లో నిరసన కార్యక్రమంలో ఎంపీలు పాల్గొన్నారు. అంతకుముందే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
అంటే జగన్ తన పరిధిలో చేయగలిగిందంతా చేస్తునే ఉన్నారు. ఇదే సమయంలో వైజాగ్ లో జరిగిన ఆందోళనలు, నిరసనల్లో వైసీపీ నేతలంతా పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. వైజాగ్ లో జరిగిన ఆందోళనలు, నిరసనల్లో ఒక్కదానిలో కూడా జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నదిలేదు. కేంద్రాన్నో లేకపోతే నరేంద్రమోడినో ఒక్కసారి కూడా నిలదీయలేదు. అసలు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగనే జరగదని కూడా మొదట్లో కమలనాదులు బుకాయించారు. ప్రైవేటీకరణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేసిన తర్వాత కమలనాదులు నోరిప్పితే ఒట్టు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పార్టీగా బీజేపీ గానీ దాని మిత్రపక్షంగా జనసేన అధినేత పవన్ గాని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోడిని ఒక్కసారి కూడా కలవలేదు. అలాంటిది ఇపుడు జగన్ను అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని డిమాండ్ చేయటమేంటో అర్ధం కావటంలేదు. అసలు జగన్ తో సంబంధంలేకుండా మిత్రపక్ష నేతలే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళచ్చు. ఢిల్లీలో ఉన్న తమ ప్రభుత్వం దగ్గరకు వాళ్ళు వెళ్ళరట కానీ జగన్ తీసుకెళ్ళాలని చేస్తున్న డిమాండే విచిత్రంగా ఉంది.
స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో జగన్ను కార్నర్ చేద్దామని మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేట్లులేదు. ఎందుకంటే ఇలాంటి ఒత్తిళ్ళకు జగన్ లొంగరన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం మీద పెట్టాల్సిన ఒత్తిడిని మిత్రపక్షాలు జగన్ మీద పెట్టాలనుకోవటమే తప్పు. మిత్రపక్షాలుగా వీళ్ళనే వెళ్ళి ప్రధానమంత్రిని కలవమంటే మాత్రం తేడాగా మాట్లాడుతున్నారు. అంటే తాము వెళ్ళినా పనిజరగదని వీళ్ళకు బాగా తెలిసినట్లుంది. అందుకనే ఈ సొల్లు కబుర్లు చెబుతున్నారు.