Begin typing your search above and press return to search.

వర్మ దమ్మును ప్రశ్నించిన జొన్నవిత్తుల

By:  Tupaki Desk   |   2 Nov 2019 9:48 AM GMT
వర్మ దమ్మును ప్రశ్నించిన జొన్నవిత్తుల
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సెన్షేషనల్‌ గానే ఉంటుంది. ప్రస్తుతం ఈయన కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా ట్రైలర్‌ విడుదలైన తర్వాత చాలా చర్చకు తెర తీసింది. పలు టీవీ ఛానెల్స్‌ ఆ ట్రైలర్‌ పై చర్చ కార్యక్రమాలు నిర్వహించాయి. వర్మ సినిమా రెండు ప్రాంతాల మద్య రెండు వర్గాల మద్య చిచ్చు పెట్టే విధంగా ఉందని.. కొందరు ప్రముఖులను కించపర్చే విధంగా ఉందంటూ ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక టీవీ చర్చ కార్యక్రమంలో అన్నారు. వర్మపై ఆయన విమర్శలు చేశాడు.

జొన్నవిత్తుల తనపై చేసిన విమర్శలకు చాలా ఘాటుగా.. సీరియస్‌ గా వర్మ స్పందించాడు. మీ ఇంట్లో వారు నిన్ను ఎలా భరిస్తున్నారు.. అప్పుడప్పుడు రొమాన్స్‌ కూడా అవసరం అంటూ 'ర' అంటూ ఉచ్చరిస్తూ జొన్నవిత్తులపై వర్మ ట్వీట్‌ చేశాడు. దాంతో వివాదం ముదిరింది. జొన్నవిత్తుల గురించి వర్మ చేసిన ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. వర్మ తనపై చేసిన వ్యాఖ్యలకు జొన్నవిత్తుల కూడా చాలా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చారు.

ఒక మీడియా ఛానెల్‌ తో జొన్నవిత్తుల మాట్లాడుతూ.. ఎవరు ఏం ప్రశ్నించడం లేదని ఇష్టానుసారంగా వర్మ సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు. ఆమద్య మెగా ఫ్యామిలీ సినిమాను తీస్తానంటూ ప్రకటించాడు. మెగా ఫ్యామిలీ నుండి ఏ మొనగాడు ఏ ఫోన్‌ చేశాడో కాని ఆ సినిమా ప్రకటన వెనక్కు తీసుకున్నాడు. నాకు భయం లేదు.. నేను దమ్మున్నోడిని అంటూ చెప్పుకునే వర్మ ఎందుకు మెగాఫ్యామిలీ సినిమా ప్రకటన వెనక్కు తీసుకున్నావు అంటూ జొన్నవిత్తుల ప్రశ్నించాడు.

తాను తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు ఏదో పాత్రల్లో నటించే వారు కాకతాళీయంగా అలా పోలికలు కుదిరాయి అంటున్నావు. చంద్రబాబు నాయుడు గారి గడ్డం.. పవన్‌ కళ్యాణ్‌ గారి హెయిర్‌ స్టైల్‌ ఇవన్నీ కూడా కాకతాళీయంగానే జరిగాయా అంటూ ప్రశ్నించాడు. నన్ను నా ఇంట్లో వారు ఎలా భరిస్తున్నారో విషయం పక్కన పెట్టండి కాని నాతో పాటు పెద్ద మనుషులను కూడా అది దారుణంగా కామెంట్స్‌ చేశాడు. అందుకే వర్మ సినిమాపై ఆయన పద్దతిపై ప్రముఖులు నోరు విప్పాలి. ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను తిప్పి కొట్టాలంటూ జొన్నవిత్తుల పిలుపునిచ్చాడు.