Begin typing your search above and press return to search.

శృంగారంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా?

By:  Tupaki Desk   |   16 May 2021 11:30 PM GMT
శృంగారంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా?
X
శృంగారం దివ్యౌషధం అంటారు నిపుణులు. శృంగారం చేయడం వల్ల కేవలం ఒత్తిడి మాత్రమే తగ్గుతుందనుకుంటే పొరపాటే. దీని వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలియదు. శృంగారంతో చాలా లాభాలున్నాయి.

శృంగారం వల్ల అనేక రకాల లాభాలున్నాయి. పైగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు తరిమికొట్టడానికి ఇది బాగా సహాయం చేస్తుంది. ఇలా ఎన్నో రకాల లాభాలు దీనివల్ల మనకు కలుగుతాయి.

శృంగారం చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రిములు, వైరస్ లు, మొదలైన వాటిని ఎదుర్కోవడానికి శృంగారం బాగా సహాయం చేస్తుంది. వారంలో ఒకసారి లేదా రెండు సార్లు శృంగారం చేసుకునే వాళ్లలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సర్వేలో తేలింది. శృంగారం చేయని వాళ్లతో పోల్చుకుంటే చేసే వాళ్లలో యాంటీ బాడీస్ పెరుగుతాయని తేలింది. కాబట్టి శృంగారం చేయడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

శృంగారంతో మహిళలకు మరీ మంచిది. వారి మజిల్స్ గట్టిగా తయారవుతాయి. యాక్సిడెంట్స్ తగ్గుతాయి. యూరిన్ లీక్ వంటివి రావు. మహిళల ఆరోగ్యానికి శృంగారం మంచిది.

శృంగారం చేయడం వల్ల గుండెపోటు రిస్క్ తగ్గుతుంది. ఆ యాక్టివిటీ ద్వారా ఈస్ట్రోజన్ , టెస్టోస్టిరోన్ లెవెల్స్ ను కూడా సరిగ్గా ఉండేటట్టు చూస్తుంది. ఈ హార్మోన్ లెవల్స్ తప్పితే గుండెపోటు , స్ట్రోక్ డెవలప్ అవుతాయి. శృంగారం చేయడం వల్ల గుండెపోటు సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు రావు. శృంగారం నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.