Begin typing your search above and press return to search.

వామ్మో ఏంటి.. ఒమిక్రాన్ పై కొవిషీల్డ్ పని చేయదా?

By:  Tupaki Desk   |   26 April 2022 2:30 AM GMT
వామ్మో ఏంటి.. ఒమిక్రాన్ పై కొవిషీల్డ్ పని చేయదా?
X
కరోనా మహమ్మారి పేరు చెబితేనే ప్రజలు వణికిపోయేలా చేస్తోంది. ఎన్నో రోజులు, సంవత్సరాలు గడుస్తున్నా అది మాత్రం అంతం అవ్వడం. కొత్త కొత్త వేరియంట్లతో రూపు మార్చుకుంటూ.. ప్రజల ప్రాణాలను మింగేస్తోంది. అయితే ఈ మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకోవాలంటే.. టీకాయే శ్రీ రామ రక్ష అని అందరూ చెప్పారు. మొదటి డోసు, రెండో డోసు, తాజాగా బూస్టర్ డోసు కూడా తీసుకోవాలంటూ... సూచిస్తున్నారు.

కరోనా టీకాలతో పాటు మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉంది. తాజాగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కోవిషీల్డ్ టీకా ప్రభావవంతంగా పని చేయడం లేదని... పుణెలోని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. నేషనల్ ఇన్ స్టిట్ట్యూట్ ఆఫ్ వైరాలజీ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడి అయినట్లు స్పష్టం చేసింది.

ఢిల్లీకి చెందిన ఓ 38 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి కొవిషీల్డ్ తీసుకున్నారు. తర్వాత రెండు సార్లు ఆయన కరోనా బారిన పడ్డారు. గతంలో కరోనా సోకి, కొవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్న వారి రోగ నిరోధక వ్యవస్థను ఒమిక్రాన్ సమర్థంగా ఎదుర్కో కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి వారు కొవిడ్ రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోస్ కూడా కచ్చితంగా తీసుకోవాల్సిందేనని వివరించారు.

పరిశోధకులు కథనం ప్రకారం.. ఆ ఆరోగ్య కార్యకర్తకు తొలిసారిగా 2020 అక్టోబర్ 9న కొవిడ్ పాజిటివ్ వచ్చిందట. ఏడాది తర్వాత అంటే 2021 నవంబర్ లో అతడిలో మళ్లీ కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే పరీక్ష చేయించుకుంటే డెల్టా వేరియంట్ సోకిందని వెల్లడైంది. రెండు నెలల్లోనే మరోసారి కూడా కరోనా సోకింది. తాజాగా ఈ సంవత్సరం అంటే 2022 జనవరి 24న ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.

ఆ ఆరోగ్య కార్యకర్త కోవిషీల్డ్ టీకా మొదటి డోసును 2021 జనవరి 31న, రెండో డోసును మార్చి 3న తీసుకున్నారు. టీకా బూస్టర్ డోసులు ఒమిక్రాన్ వేరియంట్ పై మెరుగైన రోగ నిరోధక స్పందనను కలిగిస్తున్నందున కొవిషీల్డ్ తీసుకున్న వారు కచ్చితంగా వేయించుకోవాలని చెబుతున్నారు. అప్పడే కరోనా నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నారు. అందుకే మీరు కొవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకొని ఉంటే... బూస్టర్ డోసు కూడా కచ్చితంగా తీసుకోండి.