Begin typing your search above and press return to search.
వైఎస్ విగ్రహానికి చంద్రబాబు అభ్యంతరమా?
By: Tupaki Desk | 3 Dec 2020 4:00 PM ISTచంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. పోలవరం ప్రాజెక్టును 2021, డిసెంబర్ కు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. పనిలో పనిగా ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. 100 అడుగుల ఎత్తుతో వైఎస్సార్ విగ్రహాని ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో చంద్రబాబునాయుడు చాలా తీవ్రంగా స్పందించారు. తమ అభ్యంతరాలను వ్యక్తంచేశారు.
విషయం ఏమటంటే చంద్రబాబు చెప్పిన అభ్యంతరాలు చాలా సిల్లీగా ఉండటమే. వైఎస్ విగ్రహం పెడతానంటే కేంద్రప్రభుత్వం అంగీకరించదంటు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం డబ్బులతో వైఎస్సార్ విగ్రహాన్ని ఎలా పెడతారంటూ అభ్యంతరం పెట్టడమే విచిత్రంగా ఉంది. తాము అధికారంలో ఉన్నపుడు కేంద్రం అనుమతి లేకుండా ఏపనీ చేయలేదని గుర్తుచేశారు. అలాంటిది వైఎస్సార్ విగ్రహం పెడతానంటే కేంద్రం ఏమనుకుంటుంది ? అంటూ నిలదీయంతో సభలో అందరు ఆశ్చర్యపోయారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ ఏర్పాటు చేస్తానంటున్నది తన తండ్రి వైఎస్సార్ విగ్రహం. అందుకు ఏమన్నా అభ్యంతరాలుంటే చెప్పాల్సింది కేంద్రప్రభుత్వమే కానీ చంద్రబాబు కాదు. ఇక విగ్రహం ఏర్పాటు ఖర్చు కేంద్రం నిదులతో జరుగుతుందో లేకపోతే పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందో జగన్ చెప్పలేదు. అయినా ఎవరి డబ్బులతో విగ్రహం ఏర్పాటు చేసినా చంద్రబాబుకు సంబంధమే లేదు. పైగా కేంద్రం ఏమనుకుంటుందో అనే అనుమానం అసలు చంద్రబాబుకు ఎందుకు ? ఆ విషయాన్ని జగన్ చూసుకుంటారు.
వైఎస్సార్ విగ్రహం పెడతానని జగన్ ప్రకటించటం కూడా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోవటానికి కారణం అవుతుందని చంద్రబాబు ఆరోపించటమే విడ్డూరంగా ఉంది. తన తండ్రి విగ్రహం పెట్టుకుంటాను డబ్బులు ఇవ్వమని అడిగితే కేంద్రం ఇస్తుందా అని అడిగిన చంద్రబాబును చూసి సభలో వైసీపీ వాళ్ళు నవ్వుకున్నారు. నిజానికి విగ్రహం పెట్టడనికి అయ్యే ఖర్చుల విషయం కేంద్రానికి, జగన్ కు సంబంధించిన విషయం. మధ్యలో చంద్రబాబు బాదేమిటో అర్దం కావటం లేదు. చంద్రబాబు ఆందోళన చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వటం, వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయటం ఖాయమని అర్దమైపోయినట్లుంది. అందుకనే అడ్డుగోలు మాటలు మాట్లాడుతున్నారు.