Begin typing your search above and press return to search.

వైసీపీ టీడీపీ నాయకుల మీద ఈడీ లిస్ట్ బీజేపీ దగ్గర ఉందా...?

By:  Tupaki Desk   |   8 Nov 2022 9:30 AM GMT
వైసీపీ టీడీపీ నాయకుల మీద ఈడీ లిస్ట్ బీజేపీ దగ్గర ఉందా...?
X
ఈడీ... ఇపుడు తెలుగు రాజకీయాలలో బాగా దొర్లుతున్న పదం. ఈడీ సీబీఐ అన్నవి రాజ్యంగబద్ధమైన వ్యవస్థలు. బడా నేరాల దర్యాప్తు చేసే పటిష్టమైన సంస్థలు. గతంలో ఈ సంస్థల గురించి సామాన్యుడికి పెద్దగా తెలిసేది కాదు కానీ మారుతున్న రాజకీయం ఈ ఉన్నత వ్యవస్థల గురించి బాగానే పరిచయం చేస్తొంది. దేశంలో ఇపుడు ఈడీ దాడులతో పాటు సీబీఐ విచారణలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఈడీ ప్రయోగం చేస్తున్నారు అన్న ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి.

దాంతో విసిగివేసారుతున్న వారు అంతా మోడీ ఈడీ అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్యన మునుగోడు సభలో అయితే డైరెక్ట్ గానే కేసీయార్ మోడీ ఈడీ బోడీ అంటూ ప్రాసలతో మాట్లాడి రక్తి కట్టించారు. అంటే మోడీ చెప్పినట్లుగానే ఈడీ వర్క్ చేస్తోంది అని ఆయన ఆరోపణలు చేశారన్న మాట. ఇక తెలుగు రాజకీయాల్లో బీజేపీ తన మార్క్ పాలిటిక్స్ చూపించాలనుకుంటోంది. తనకు దక్కని చిక్కని రాజకీయాన్ని అనువుగా మార్చుకోవాలని చూస్తోంది అని కూడా చెబుతున్నారు.

దాంతో ఈడీ పేరు ఇపుడు పదే పదే పాలిటిక్స్ లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో కీలకమైన సమాచారం చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే ఏపీకి చెందిన వైసీపీ టీడీపీ నాయకుల మీద ఈడీ లిస్ట్ ప్రిపేర్ రెడీ చేసిందని అంటున్నారు. ఆ లిస్ట్ బీజేపీ పెద్దల వద్ద కూడా ఉందని అంటున్నారు. బీజేపీ ఎపుడూ డబుల్ ఇంజన్ అని చెబుతూ వస్తుంది.

డబుల్ ఇంజన్ అంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండాలని కమలనాధుల పట్టుదల. అదే నినాదం అన్న మాట. అయితే దానికి విపక్షాల నుంచి సెటైరికల్ గా మరో నినాదం కూడా వినిపిస్తోంది. అదేంటి అంతే ఈడీ సీబీఐ ఈ రెండూ డబుల్ ఇంజన్లుగా చేసుకుని బీజేపీ దూకుడు చేస్తోందని విమర్శలు కూడా ఎక్కుపెడుతున్నారు.

ఈ విధంగా ఏపీలో చూస్తే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ బడా నేతల లిస్ట్ ని దగ్గరపెట్టుకుందని అంటున్నారు. వాటి ఆసరాతో ఈడీ సీబీఐలను ప్రయోగించడం ద్వారా తమ రాజకీయాన్ని పండించుకోవాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు. ఏపీలో అధికార వైసీపీ అయితే బీజేపీకి అవుట్ రేట్ గా మద్దతు ఇస్తోంది. అదే టైం లో టీడీపీ సైతం బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఉంటోంది. పైగా బీజేపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందమాని చూస్తోంది.

మరి అలాంటి ఈ రెండు పార్టీలకు చెందిన నాయకుల జాబితాను బీజేపీ ఎందుకు దగ్గర పెట్టుకోవాలనుకుంటోంది అన్న చర్చ వస్తోంది. నిజానికి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీ లాభమే తప్ప నష్టం లేదు. ఎందుకంటే ఆయా పార్టీలు బీజేపీకే మద్దతు ఇస్తాయన్నవి వాస్తవం. మరి అలాంటపుడు ప్రత్యేకంగా తనతో ఏ రకమైన శతృత్వం కూడా నెరపని పార్టీలని బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది అన్నదే డౌట్ గా ఉంది.

అయితే బీజేపీకి ఇది చాలదని, ఏపీలో రాజకీయ వాటా కోసమే ఆ పార్టీ చూస్తోంది అని అంటున్నారు. తనతో పొత్తు పెట్టుకునే పార్టీలు భారీ ఎత్తున సీట్లతో పాటు తాను చెప్పినట్లుగా నడవాలన్న ఆలోచన ఏదో బీజేపీకి ఉండి ఉండాలని అంటున్నారు. అలాగే ఏపీ రాజకీయాలు పూర్తిగా తన కనుసన్నలలో జరగాలని కూడా బీజేపీకి ఏవో ఉద్దేశ్యాలు ఉండి ఉంటాయని కూడా ఊహిస్తున్నారు. అందుకే ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ కి ఆ పార్టీ దిగబోతోందా అన్నదే చర్చగా ఉంది.

ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఈడీ సీబీఐలను దింపాలనుకుంటే కనుక కచ్చితంగా అది రాజకీయంగా సంచలనమే అవుతుంది. అదే టైం లో తెలంగాణాలో చేసినట్లుగా ఏపీలో చేస్తే రిజల్ట్ తేడా కొడుతుంది అని కూడా అంటున్నారు. ఏపీలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. ఉంటే గింటే తెలంగాణాలోనే బలం ఉంది. అలాంటి చోట టీయారెస్ ఎటూ సవాల్ చేస్తోంది కాబట్టి బీజేపీ దూకుడు పెంచింది అంటున్నారు కానీ ఏపీలో సామరస్యంగా ఉన్న వాతావరణాన్ని కనుక తనదైన డబుల్ ఇంజన్ పాలిటిక్స్ తో పాడుచేసుకోవాలని చూస్తే అది బీజేపీకే తీవ్ర నష్టం కలిగిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.