Begin typing your search above and press return to search.

ప్రతి భారతీయుడికి అమెరికా 72 వేల అప్పు ఉందా?

By:  Tupaki Desk   |   27 Feb 2021 5:28 PM IST
ప్రతి భారతీయుడికి అమెరికా 72 వేల అప్పు ఉందా?
X
అగ్రరాజ్యం అమెరికా.. అన్ని పేద దేశాలకు.. భారత్ వంటి వర్థమాన అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా సాయం చేస్తుంటుంది. అలాంటి అమెరికాకు అప్పు ఉందా? అదీ మన భారత దేశం దగ్గర కూడా చేసిందా.? అంటే ఔననే సమాధానం వస్తోంది.

అగ్రరాజ్యం అమెరికా అప్పులు ఇప్పుడు అంతకంతకూ పెరిగిపోతున్నాయంటూ ఆ దేశ కీలక చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పైగా అధిక శాతం అప్పులు ఆ దేశానికి అన్ని రంగాల్లో సవాల్ విసురుతున్న చైనా నుంచి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక భారత్ కు సైతం అమెరికా 216 బిలియన్ డాలర్లు రుణపడి ఉందని చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆ దేశ అప్పులు 29 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు ఆయన తెలిపారు. 2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుకు చేరాయని మూనీ తెలిపారు.

దీన్ని బట్టి అమెరికా దేశంలో ఒక్కొక్కరిపై సగటున 72309 డాలర్ల అప్పు ఉన్నట్లు వివరించారు. గత ఏడాది కాలంలో తీసుకున్న అప్పును ఒక్కొక్కరికీ పంచితే 10000 డాలర్లు వస్తుందని తెలిపారు.అమెరికాకు మిత్రదేశాలు కానీ చైనా, జపాన్ కే ఎక్కువగా రుణపడి ఉన్నామని చట్టసభ సభ్యుడు వ్యాఖ్యానించారు. ఈ రెండుదేశాల్లో ఒక్కొక్క దానికి ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా అమెరికా రుణపడి ఉందని తెలిపారు.2000 సంవత్సరంలో 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పులు ఒబామా హయాంలో రెండితలు అయ్యాయని మూనీ తెలిపారు. ఉద్దీపన పథకాన్ని ఆమోదించే ముందు దీనిని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన తోటి చట్టసభ సభ్యులను కోరారు.