Begin typing your search above and press return to search.

బాగా నిద్రపోవడమే కరోనాకు మందు

By:  Tupaki Desk   |   31 July 2020 2:30 PM GMT
బాగా నిద్రపోవడమే కరోనాకు మందు
X
కరోనాకు మందు లేక.. వ్యాక్సిన్ రాక.. దాని నుంచి తప్పించుకోవడం ఎలానో తెలియక అందరూ నానా యాతన పడుతున్నారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మన ముందున్న కర్తవ్యం.

అయితే రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఇప్పుడు సరైన మార్గంగా ఉంది. ఇక ఇమ్యూనిటీని పెంచుకునేందుకు నిద్ర కూడా ఒక సరైన ఆయుధమని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో తెల్లరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట.. శరీరంలో వైరస్ బారిన పడిన కణాల్ని చంపేవి ఈ కణాలే. కాబట్టి నిద్ర తక్కువ అయ్యే కొద్దీ ఒంట్లో ఒంట్లో వైరస్ రిస్క్ పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు వైద్యులు.

కాబట్టి కరోనా సోకిన కూడా నిద్ర పోవడం అనేది ఇందులో కీలకమైన సాధనంగా తెలుస్తోంది. అందుకే రోజుకు 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత మంచిదని చెబుతున్నారు.

ఇక నిద్రపట్టడం లేదంటే ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండాలని సూచిస్తున్నారు. అలా అయితే రోజంతా చలాకీగా ఉంటారు. రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది. మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. ఎందుకంటే రాత్రి నిద్రపట్టదు. రాత్రి నిద్రే మనిషి ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే ముందు పాలు, మజ్జిగ తాగితే నిద్ర పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.