Begin typing your search above and press return to search.

డ్యాన్స్ చేస్తున్న కరోనా వార్డులోని వైద్యుల .. కారణం ఏంటంటే

By:  Tupaki Desk   |   6 March 2020 5:30 PM GMT
డ్యాన్స్ చేస్తున్న కరోనా వార్డులోని  వైద్యుల .. కారణం ఏంటంటే
X
మొన్నటి వరకు కరీనా ఫీవర్ తో ఊగిపోయిన భారతీయులు ..ప్రస్తుతం కరోనా ఫీవర్ తో వణికిపోతున్నారు. అసలు కరోనా అన్న పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచలోని చాలా దేశాలు భయంతో వణికిపోతున్నాయి. మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా వ్యాపించే ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు దేశ దేశాల వైద్యులు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే , ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. వైరస్‌ నుంచి వైద్యులు తమను తాము కాపాడుకోవడమూ కూడా చాలా ముఖ్యం. ఒకవైపు తమను కాపాడుకుంటూనే.. కరోనా బాధితులనూ రక్షించాల్సి ఉంటుంది.

దీనితో తీవ్రమైన ఒత్తిడిలో సైతం వైద్యులు కరోనా బాధితుల కోసం కష్టపడుతూనే .. ఆ భయం నుండి బయటపడేందుకు కొంత మంది డాక్టర్లు డ్యాన్సులు లాంటివి చేస్తూ సేద తీరుతున్నారు. కరోనా వైరస్‌ తో ఆస్పత్రికి వచ్చిన రోగులకు చికిత్స అందించడంతో పాటు..డ్యాన్స్ లు చేస్తూ తమకు తాము మనో ధైర్యాన్ని పొందుతున్నారు. అలా వారు చేసిన పలు డ్యాన్సింగ్‌ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇరాన్‌ వైద్యులు చేసిన డ్యాన్సులు కరోనా వైరస్‌ ‘ఇరాన్‌ డ్యాన్సింగ్’ పేరుతో ట్విటర్‌లో దర్శనమిస్తున్నాయి. వాటిల్లో మాస్కులు, రక్షణాత్మక వస్త్రాలు ధరించిన కొందరు వైద్యులు ఇరానీ సంగీతానికి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీని ద్వారా అటు రోగులకు, ఇటు వైద్యులకు మనో ధైర్యం వస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.కాగా కరోనా కారణంగా ఇరాన్‌లో మృతి చెందిన వారి సంఖ్య107కు చేరింది. 3 వేల మందికి పైగా లక్షణాలు ఉన్నవారిని గుర్తించారు. ఈ వైరస్ వేగంగా వ్యాపించిన దేశాల్లో చైనా తర్వాత ఇరాన్ ఉండటం తో , ఇరాన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోంది. అలాగే ప్రజలని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. పర్షియన్ల కొత్త సంవత్సరమైన మార్చి 20వ తేదీన స్కూళ్లు, యూనివర్సిటీలను మూసివేయనున్నట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి సయీద్ నమామీ వె ల్లడించారు.