Begin typing your search above and press return to search.

ఐసోలేషన్ వార్డ్ లో అమ్మాయి పై డాక్టర్ లైంగిక వేధింపులు

By:  Tupaki Desk   |   28 July 2020 3:20 PM IST
ఐసోలేషన్ వార్డ్ లో అమ్మాయి పై డాక్టర్ లైంగిక వేధింపులు
X
కరోనా వైరస్ లాంటి ప్రాణాంతకమైన మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ఓ బాధ్యతాయుతమైన డాక్టర్ వృత్తిలో ఉంటూ ఓ యువతి పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నోయిడా లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో సోమవారం జరిగింది. ఘటన జరిగిన అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే .. ఈ మద్యే 20 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. దీనితో ఆమె నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం చేరింది. ఈ సమయంలోనే కరోనా బాధితులకి ట్రీట్మెంట్ అందించిన ఓ డాక్టర్‌ కు సైతం కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీనితో ఆ డాక్టర్ ను బాధితురాలి తో కలిపి ఒకే ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ సమయంలో ఓ డాక్టర్ గా ఆ అమ్మాయికి దైర్యం చెప్పాల్సింది పోయి , ఆ అమ్మాయి పై లైంగిక వేధింపులకు దిగాడట. దీనితో ఆ డాక్టర్ సోమవారం తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై అడిషనల్‌ డీసీపీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు ఆస్పత్రి యాజమాన్య వ్యవహార శైలి కూడా కారణమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని , నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు కోవిడ్‌ పేషెంట్లను ఒకే వార్డులో ఉంచి సేవలు అందించినందుకు చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు అని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుకు వెంటనే స్పందించి ఎఫ్ ‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో నే ఉన్నాడని, కరోనా నియమాలని పాటిస్తూ నిందుతుడి వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.