Begin typing your search above and press return to search.

ప్రియుడు..ప్రియురాలు..ఓ ఆర్ ఎంపీ!

By:  Tupaki Desk   |   26 Sept 2019 2:45 PM IST
ప్రియుడు..ప్రియురాలు..ఓ ఆర్ ఎంపీ!
X
వాళ్లిద్దరూ ఎంబీఏ చదువుతున్నారు. ప్రేమలో పడ్డారు. ఎంబీఏ పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెద్దలను సైతం ఒప్పించారు. ఇక పెళ్లియే తరువాయి అనుకొని ప్రొసీడ్ అయ్యారు. పట్టపగ్గాల్లేకుండా ఎంజాయ్ చేశారు.. కట్ చేస్తే ఆ యువతికి 4 నెలల కడుపొచ్చింది. దీంతో ఇంట్లో తెలిస్తే తంతారని ప్రియుడి చేసిన పనికి ఆ ప్రియురాలు చనిపోయింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా నగరిలో చోటుచేసుకుంది.

నగరికి చెందిన విజయ్ - భువనలు ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరూ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంట్లో కూడా ఒప్పించి చదువులయ్యాక పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ క్రమంలోనే వీరి ప్రేమ హద్దులు దాటింది. భువన నాలుగు నెలల గర్భవతి అని తేలింది.

ఇంట్లో చెబితే గొడవ అవుతుందని తెలిసి విజయ్ తనకు తెలిసిన దేవీ అనే ఆర్ ఎంపీ డాక్టర్ ను సంప్రదించాడు. ఆమెకు 12వేలు ఇచ్చి అబార్షన్ చేయమన్నాడు. ఆమె తెలిసి తెలియక చేసిన వైద్యం వికటించింది. తీవ్ర గర్భ స్రావంతో పాటు రక్తస్రావమైంది. దీంతో వెంటనే భువనను ఆర్ ఎంపీ - విజయ్ లు కలిసి నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సమయానికి లేకపోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి చనిపోయింది. వైద్యం తెలియని ఆర్ ఎంపీ - పొరపాటు చేసిన విజయ్ వల్ల భువన నిండు ప్రాణాలు కోల్పోయింది..