Begin typing your search above and press return to search.

కరోనాతో పోయిన రంగు..ఆ డాక్టర్ కు తిరిగి వచ్చిందట

By:  Tupaki Desk   |   28 Oct 2020 9:45 AM IST
కరోనాతో పోయిన రంగు..ఆ డాక్టర్ కు తిరిగి వచ్చిందట
X
అంతుచిక్కని మహమ్మారిగా మారిన కరోనా.. ప్రపంచాన్ని ఎంతలా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటికి కనిపించని ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమే స్తంభించిపోయిన పరిస్థితి. ఎంతకు కొరుకుడుపడని.. ఈ వైరస్ సిత్రాలు అన్ని ఇన్ని కావు. పురుషులతో పోలిస్తే.. మహిళలు దీని బారిన తక్కువగా పడటం ఒక ఎత్తుఅయితే.. ఎక్కువమంది బాధితులు.. ఓ బ్లడ్ గ్రూపు కాని వారు కావటం గమనార్హం.

ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి ప్రభావం చూపిస్తున్నకరోనా.. చైనాకు చెందిన ఒక వైద్యుడి విషయంలో ఊహించిన షాకిచ్చింది. పాజిటివ్ అని తేలిన తర్వాత ఈ వైద్యుడి (ఈ ఫ్యాన్) చర్మం రంగు అనూహ్యంగా మారిపోయింది. అతడికి వైద్య సేవలు అందించే క్రమంలో ఇంటెన్సికేర్ యూనిట్ లో చికిత్స అందించారు. ఈ సందర్భంగా యాంటీ బయోటిక్ మందుల్ని ఇచ్చారు.

వీటిని వినియోగించిన తర్వాత అతడి చర్మం రంగు పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు తెల్లగా ఉండే ఇతను.. ముదురు గోధుమ రంగులోకి మారిపోయారు. దీంతో.. ఆయనకు ఏమీ పాలుపోని పరిస్థితి. దాదాపు 39 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స పొందారు. కరోనాను జయించిన ఆయన.. తన చర్మం రంగు పూర్తిగా మారిపోవటంతో షాక్ తిన్నారు. అనూహ్యంగా.. కరోనా నుంచి బయటపడిన ఆయన.. ఎట్టకేలకు తన పాత చర్మం రంగును సొంతం చేసుకోవటంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలాంటి అనుభవాన్ని మిగిలుస్తోంది కరోనా.