ఢిల్లీలో కలకలం: నెగటివ్ వచ్చినా.. డాక్టర్ మృత్యువాత

Sun Jul 05 2020 07:00:03 GMT+0530 (IST)

doctor dies cardiac arrest after testing twice negative corona

వైరస్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా మారింది. వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మృతులు సంభవిస్తున్నొయి. టాప్-5లో ఢిల్లీ నిలుస్తోంది. దీంతో సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు.. అధికారులు వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా వైద్యులు.. వైద్యారోగ్య సిబ్బంది.. వైరస్ కు బలవడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఓ వైద్యుడి మృతి అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకంటే టెస్టుల్లో నెగటివ్ వచ్చినా అతడు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెంటల్ సైన్సెస్ (మెయిడ్స్)లోని ఓరల్ సర్జరీ డిపార్టుమెంట్లో జూనియర్ డాక్టర్ గా అభిషేక్ పని చేస్తున్నారు. ఎయిమ్స్ ఎండీఎస్ పరీక్షలో జాతీయ స్థాయిలో 21వ ర్యాంకు తెచ్చుకున్న ఆయన జూన్ నెలలో హరియాణాలోని రోహ్తక్కు వెళ్లి వచ్చారు. టెస్టుల్లో రెండుసార్లు నెగటివ్ వచ్చిన ఢిల్లీకి చెందిన ఆయన గురువారం చనిపోయారు. అయితే అతడు ప్రాణాలు కోల్పోయేముందు ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోలేకపోవడం తదితర లక్షణాలు డాక్టర్ అభిషేక్ భయానాలో కనిపించాయని మృతుడి సోదరుడు అమన్ తెలిపారు. తనకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని.. ఈ లక్షణాలన్నీ వైరస్ వేనని.. తనకు కచ్చితంగా పాజిటివ్ వచ్చిందని అభిషేక్ తన చివరి మాటల్లో చెప్పినట్లు వివరించారు.