Begin typing your search above and press return to search.

పదవి కాలానికి ముందే మెడపట్టి గెంటేస్తారా? ట్రంప్​కు అవమానకర ఉద్వాసన..!

By:  Tupaki Desk   |   13 Jan 2021 9:55 AM IST
పదవి కాలానికి ముందే మెడపట్టి గెంటేస్తారా?  ట్రంప్​కు అవమానకర ఉద్వాసన..!
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను పదవికాలానికి ముందే ఇంటికే పంపించేయాలని యూఎస్​ హౌస్​ చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్​ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆయన హుందాగా పదవి నుంచి తప్పుకోకుండా చికాకులు సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాదిస్తూ వచ్చారు. మరోవైపు ఇటీవల ట్రంప్​ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్​ బిల్డింగ్​ పైకి దూసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులు కూడా జరపవలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్​లో ఆయన విద్వేషపూరితంగా, రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేయడంతో ట్విట్టర్​ కూడా ఆయన అకౌంట్ ను తొలగించింది.

ఈ నెల 19 వ తేదీ వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. అయితే ఆ లోపే ఆయనను దించేయాలని అక్కడి పార్లమెంట్​ యోచిస్తున్నది. అందుకోసం 25 వ సవరణను ప్రయోగించాలని హౌస్​ యోచిస్తున్నది. మరోవైపు అధికార రిపబ్లికన్​ పార్టీ సభ్యులు కూడా ట్రంప్​ను దించేందుకు సహకరిస్తున్నారట. అయితే ఇటీవల వాషింగ్టన్​లో జరిగిన అల్లర్లు ట్రంప్​ మెడకు చుట్టుకున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆయన అభిమానులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్​పై ఆరోపణలు వెల్లువెత్తాయి.

అయితే 25వ సవరణపై యూఎస్​ కాంగ్రెస్​లో హైడ్రామా చోటుచేసుకున్నది. డొనాల్డ్ ట్రంప్‌కు ఉద్వాసన పలకడానికి 25వ సవరణను ప్రవేశపెట్టాలంటూ హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ చేసిన విజ్ఞప్తిని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తోసిపుచ్చారు. తాను ఆ సవరణను ప్రవేశపెట్టలేనని తేల్చేశారు. మైక్ పెన్స్ నిరాకరణతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. 25వ సవరణపై యూఎస్ కాంగ్రెస్, సెనెట్‌లో డిబేట్ నడుస్తోంది. ఓటింగ్ చేపట్టారు. ఇందులో నెగ్గితే.. మైక్ పెన్స్‌కు ఇష్టం లేకపోయినా..ఆ సవరణను సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.అయితే ప్రస్తుతం ట్రంప్​ టెక్సాస్​లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25వ సవరణ తనను ఏమీ చేయలేదని పేర్కొన్నారు. 19 వరకు తాను పదవిలో కొనసాగుతానని తేల్చిచెప్పారు.