Begin typing your search above and press return to search.
మద్యానికి గుడ్ బై చెప్పించే బీరకాయ ..
By: Tupaki Desk | 16 Feb 2020 12:00 PM ISTప్రస్తుత రోజుల్లో మద్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ మద్యానికి బానిస కావడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పని ఒత్తిడి వల్ల కొందరు , మరో సమస్య వల్ల మరికొందరు బానిసై , బంగారం వంటి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అయితే , అనుకోకుండా వచ్చిన ఈ అలవాటు మానుకోవాలని అనుకున్నా కూడా , ఎలా మానేయాలో తెలియక రోజురోజుకి మరింతగా బానిసై పోతున్నారు. అలాంటివారు ..రోజు తినే ఆహారంలో బీరకాయను భాగం చేసుకుంటే ఆ అలవాటుని మర్చిపోవచ్చు. బీరకాయలో ఉండే పోషకాలు తాగుడు అలవాటును మాన్పిస్తాయి. ఎలా అంటే ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. బీరలోని మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడం ద్వారా షుగర్ వ్యాధినీ నియంత్రిస్తుంది.
బీరకాయలోని విటమిన్-ఎ కంటి కండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని తాజా పరిశోధన లో తేలింది. అల్సర్లు, కడుపు లో మంటలతో బాధ పడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుంది. వీటిలో విటమిన్ సి కూడా ఉండి జలుబుకు దూరంగా వుంచుతుంది. బి విటమిన్‌లు మంచి మూడ్‌ను, యవ్వనాన్ని అందిస్తాయి. ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. మెగ్నీషియం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకలను దృఢంగా వుంచుతాయి. ఇన్ని రకాల ప్రయోజనాల గల బీరకాయలను అన్ని సీజన్లలోనూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుంటారు. వీటితో రకరకాల వంటల్ని తయారు చేసుకుని వారానికి రెండు సార్లు తినొచ్చు.
బీరకాయల్లోని విటమిన్ బి6 ఎనీమియా ను నివారిస్తుంది. బీరకాయల్లోని పెప్టయిడ్స్, ఆల్కలాయిడ్లూ రక్తంలోని చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి. బీరకాయల్లో రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. కామెర్ల నుంచి కోలుకునేవారికి బీరకాయ రసం బాగా పని చేస్తుంది. బీరకాయ గింజలు కాలేయాన్ని పరిశుభ్రపరచడానికి దోహదపడుతాయి. ఒక కప్పు తాజా బీరకాయ రసంలో కొద్దిగా స్వీట్‌నర్ కలుపుకుని రోజుకు రెండు సార్లు గా తాగుతుంటే కామెర్లు, కాలేయ వ్యాధుల నుంచి త్వరగా కోలుకునే అవకాశం వుంటుంది. అలాగే కడుపు లో పేరుకు పోయిన వ్యర్థ పదార్థాలను బీరకాయ శుభ్రం చేస్తుంది.