Begin typing your search above and press return to search.
కవితక్క విమర్శలు గుర్తున్నాయా పవన్
By: Tupaki Desk | 1 Feb 2020 12:43 PM ISTఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రధానంగా రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతుండగా కొందరు మధ్యలో నానా హడావుడి చేస్తుంటారు. అసలు వారి ఉద్దేశం ఏమిటో.. ఎందుకు రాజకీయాల్లో ఉన్నారో వారికే తెలియదు. అలాంటి వారెవరో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూశాం. ఎన్నికల తర్వాత కొందరు కనుమరుగు కాగ ఒక పెద్ద మనిషి మాత్రం తన ఉనికి చాటుకునేందుకు తహతహలాడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న ఆయనకు ఇంకా రాజకీయ నాయకుడి లక్షణాలు మాత్రం రాలేదు. ఇప్పుడు ఆ అపరిపక్వ నాయకుడు కొత్తగా బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ వరకైతే ఏమో అనుకోవచ్చు. కానీ తెలంగాణ లో కూడా పొత్తు కొనసాగుతుందని ప్రకటించాడు.
మొదటి నుంచి పవన్‌కల్యాణ్ బీజేపీ పై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నా నోరు మెదపని వ్యక్తి ఎవరంటే పవన్ పేరే గుర్తుకు వస్తుంది. ఎన్నికల సమయం లో అదే వైఖరి అవలంభించాడు. ఇప్పుడు అదే నిజమైంది. హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి కమలం పార్టీ నాయకులతో సమావేశమయ్యాడు. వెంటనే పొత్తు అని ప్రకటించాడు. ఎందుకు పొత్తు.. ఏం ఆశించి పొత్తు పెట్టుకున్నాడో ఆయనకైనా తెలుసో లేదో.. కానీ వెళ్లాడు.. మీటింగ్‌లో కూర్చున్నాడు.. చేతులు కలిపి బీజేపీతో జనసేన పొత్తు అని తెలిపాడు.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఉందని మీడియాలో తప్ప ప్రజలకు ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి బీజేపీతో పొత్తు కుదర్చుకుని వచ్చాడు. అయితే ఆ పొత్తు తెలంగాణ లో కూడా ఉంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించాడు. పవన్‌తో ఏం ఆశించి లక్ష్మణ్ ఆవిధంగా ప్రకటించాడో తెలియదు కానీ పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కి ఉన్న ఓటు బలం కూడా తగ్గే ప్రమాదం ఉంది.
రాష్ట్ర విభజన అనంతరం పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఉన్నాడు. అయితే ఇక్కడ అధికార పార్టీ టీఆర్‌ఎస్ నాయకుల విమర్శల ధాటికి తాళలేక దుకాణం సర్దుకుని ఏపీకి మకాం మార్చిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తన గురువు చంద్రబాబులాగే అప్పుడు పవన్ ఏపీకి వెళ్లాడు. అయితే ఇప్పుడు పొత్తు కుదుర్చుకోవడంతో పవన్‌కల్యాణ్‌ను తెలంగాణకు తీసుకొస్తామని లక్ష్మణ్ ప్రకటించాడు. ఏపీలో ప్రభావం చూపలేని నాయకుడు తెలంగాణలో ఏం చేస్తాడో చూడాలి.