Begin typing your search above and press return to search.

రెండేళ్లైనా ఓడింది ఎందుకో తెలీదేంటి చంద్రబాబు?

By:  Tupaki Desk   |   15 Jan 2021 2:00 PM IST
రెండేళ్లైనా ఓడింది ఎందుకో తెలీదేంటి చంద్రబాబు?
X
వ్యంగ్యస్త్రాల్ని సంధించటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తర్వాతే. రాజకీయాల్లో విమర్శలు.. ఆరోపణలు చేయటంలో కొత్తట్రెండ్ ను తీసుకొచ్చిన ఆయన.. సోషల్ మీడియాలో భారీ ఎత్తున చెలరేగిపోతుంటారు. వెనుకా ముందు చూసుకోకుండా విరుచుకుపడే ఆయన ట్వీట్ చేసే ప్రతి ఐదింటిలో ఒకట్రెండు చంద్రబాబు మీదనే ఉంటాయని చెప్పాలి.

బాబు అన్నా.. ఆయన నీడ అన్నా.. మాట అన్నా విపరీతంగా వ్యతిరేకించే అలవాటున్న విజయసాయి పండుగ పూట కూడా వదల్లేదు. ఇటీవల మాట్లాడిన ఆయన.. తానేం తప్పు చేశానో తెలీటం లేదుని.. డెవలప్ మెంట్ చేయటం తప్పించి తానేమీ చేయలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. బాబు నోటి నుంచి వచ్చిన మాటల్నే ప్రాతిపదికగా తీసుకొని.. వ్యంగ్యంగా ఎటకారం ఆడేశారు.

చిత్తుగా ఓడిపోయి రెండేళ్లు అవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట అంటూ భారీ పంచ్ వేసిన ఆయన.. అక్కడితో వదలక.. సంక్రాంతి సృష్టికర్తనని బాబు చెప్పుకుంటారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారంటూ మండిపడ్డారు.

ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? ధ్వంసం చేస్తూతన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నాడు’ అని ఫైర్ అయిన విజయసాయి..మరోట్వీట్ లోనూ చంద్రబాబు మాటల్ని తీవ్రంగా తప్పపట్టారు. అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారని.. మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలని భోగి మంటల్లో వేయమంటారేమిటి? అంటూ ప్రశ్నించారు. ‘హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా? రైతులు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు?’ అని కస్సుమన్నారు. పండుగ పూట కూడా చంద్రబాబుకు విజయసాయి ట్వీట్ తలంటు తప్పలేదుగా?