Begin typing your search above and press return to search.

కేసీఆర్ సాయం ఎవరికి చేస్తున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   22 Feb 2022 12:30 AM GMT
కేసీఆర్ సాయం ఎవరికి  చేస్తున్నారో తెలుసా?
X
నిన్న‌టి వేళ కేసీఆర్, ఉద్ధ‌వ్ ఠాక్రేను క‌లిశారు.లంచ్ మీట్ అనంత‌రం ముంబ‌యి దారుల్లో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. చ‌ర్చ‌ల‌కు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌క సార‌థ్యం వ‌హించారు. తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ క‌విత కూడా హాజ‌రయ్యారు. రాజ్య‌స‌భ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోశ్ కుమార్ కూడా సంద‌డి చేశారు. ఇవ‌న్నీ బాగానే ఉన్నా దేశ రాజ‌కీయాల్లో సంద‌డి చేయాల‌ని, స‌త్తా చాటుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కేసీఆర్ కు నిన్న‌టి పరిణామాలు ఏ విధంగా క‌లిసి వ‌స్తాయి అన్న సందేహం ఒక‌టి సోష‌ల్ మీడియాలో వినిపిస్తుంది.

ముఖ్యంగా అస్స‌లు నిల‌క‌డ అంటూ లేని నాయ‌కులుగా ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కానీ శివ‌సేన అధిప‌తి ఉద్ధ‌వ్ ఠాక్రే కానీ పేరు తెచ్చుకున్నారు. వీళ్ల‌తో క‌లిసి ఆయ‌న రాజ‌కీయం చేయ‌డం పెద్దగా క‌లిసివ‌చ్చే విష‌య‌మే కాద‌న్న‌ది ఓ వాద‌న.

ముఖ్యంగా త‌మ అధిప‌తి శివ‌సేనాని ఉద్ధ‌వ్ కూడా పీఎం రేసులోనే ఉన్నార‌ని చెబుతున్నారు సంబంధిత పార్టీ స‌భ్యులు. అలాంట‌ప్పుడు కేసీఆర్ అనుకుంటున్న ప్ర‌ధాని క‌ల ఎలా నెర‌వేరుతుందని? ఇదేస‌మ‌యంలో అస్స‌లు నిల‌క‌డ‌లేని ఎన్సీపీ అధినేత గ‌తంలో యూపీఏ అధినేత్రి కి చుక్క‌లు చూపించారు.

ఇదే స‌మ‌యంలో మ‌రో అధినేత్రి మ‌మ‌తా కూడా అంతే! మ‌రి! వీళ్లంతా ఏకమై ఎవ‌రికి సాయం చేస్తున్నారని?

పేరుకు యూపీఏ వ్య‌తిరేక ప‌క్షంగా ఉన్న వాళ్లంతా ఏక‌మై పోవాల‌ని ఎన్డీఏకు వ్య‌తిరేకంగా ఉన్న వాళ్లంతా ఏక‌మైపోవాల‌ని అనుకున్నా అది సాధ్యం కాని ప‌ని. ముఖ్యంగా బీజేపీ మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న శివ‌సేన కానీ కేసీఆర్ కానీ ఇప్ప‌టికిప్పుడు మాట మార్చి రాజ‌కీయం చేయాల‌నుకున్నా అవ‌న్నీ బీజేపీకి ఉప‌యోగ ప‌డే విష‌యాలే..ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ ను దెబ్బ‌కొట్టి బీజేపీకి సాయం చేసే రాజ‌కీయాలే! లోక్ స‌భ‌కు సంబంధించి 17 మంది ఎంపీలు తెలంగాణ‌లో ఉన్నారు. అందులో టీఆర్ఎస్ 10 మంది మాత్ర‌మే టీఆర్ఎస్ ఎంపీలు.

మిగిలిన వారంతా వేర్వేరు పార్టీల‌కు చెందిన ఎంపీలు. మ‌రి! వీళ్ల‌తో తెలంగాణ రాష్ట్ర స‌మితి సార‌థి సాధించిందేంట‌ని? క‌నుక కేసీఆర్ రాజ‌కీయం కార‌ణంగా బీజేపీకి ల‌బ్ధి చేకూర‌డం ఖాయం. అలానే కాంగ్రెస్ కు దెబ్బ త‌గ‌ల‌డం కూడా ఖాయ‌మే! ఒక వేళ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల్చ‌డంలో కేసీఆర్ తెర‌పైకి తీసుకువ‌చ్చే కూట‌మి బ‌లంగా ప‌నిచేసినా కూడా ఆ విధంగా కూడా బీజేపీకి లాభ‌మే!