Begin typing your search above and press return to search.

మనదేశంలో రిచ్చెస్ట్​ క్రికెటర్​ ఎవరో తెలుసా? మీరు ఊహించలేరు?

By:  Tupaki Desk   |   26 March 2021 2:30 PM IST
మనదేశంలో రిచ్చెస్ట్​ క్రికెటర్​ ఎవరో తెలుసా? మీరు ఊహించలేరు?
X
మనదేశంలో రిచ్చెస్ట్​ క్రికెటర్​ ఎవరు? అంటే సచిన్​ టెండూల్కరో, విరాట్​ కోహ్లీనో, మహేంద్రసింగ్​ ధోని, రోహిత్​ శర్మ వీరిలో ఎవరో ఒకరు ఉంటారు అనుకుంటాము. కానీ కాదు వీరి కంటే ధనవంతుడైన క్రికెటర్​ ఉన్నాడు. అతడు ఎవరంటే ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్​ బిర్లా. అతడు ప్రస్తుతం టీమిండియాలో చోటు సంపాదించడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందుకోసం కోచింగ్​ తీసుకుంటున్నాడు. ఎందుకంటే క్రికెట్​లో రాణించాలంటే పలుకుబడి ఉంటే సరిపోదు. పలుకుబడి ఎంట్రీ వరకు సరిపోతుందేమో కానీ.. ఆ తర్వాత రాణించాలంటే సత్తా ఉండాల్సిందే. అందుకే ప్రస్తుతం ఆర్యమాన్​ బిర్లా క్రికెట్​ కోచింగ్​ తీసుకుంటున్నాడు. ప్రముఖులైన కోచ్​ల పర్యవేక్షణలో అతడు శిక్షణ పొందుతున్నాడు.

ఆర్యమాన్ బిర్లా ఆస్తి నికర విలువ రూ .70 వేల కోట్లు. కాబట్టి ఒకవేళ అతడు టీమిండియా కు సెలెక్ట్​ అయితే గనక అతడే అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ​గా నిలుస్తాడు. ప్రస్తుతం ఆర్యన్‌ మన్ బిర్లా వయసు 23 ఏళ్లు. చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే అతడికి పిచ్చి. తానో గొప్ప క్రికెటర్​ ను కావాలని కలలు గన్నాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెటర్​గా రాణించేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఆర్యమాన్​ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మాన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. అంతేకాక ఆర్యమాన్​ మధ్య ప్రదేశ్​ రంజీ ట్రోఫీ జట్టులో పేరు సంపాదించగలిగారు.

‘నన్ను నేను నిరుపించుకోవాలని అనుకున్నాను. అందుకోసమే ఈ రంగం లోకి వచ్చాను. నా పేరు, నా బ్యాక్​గ్రౌండ్​ వదిలేసి.. నన్ను మామూలు క్రికెటర్​ గా చూడండి.. అప్పడే నా సత్తా ఏమిటో సరిగ్గా అంచనా వేయగలుగుతారు’ అంటూ ఆర్యమాన్​ పేర్కొన్నారు. నవంబర్ 2017 లో ఇండోర్‌ లో ఒడిశాపై మధ్యప్రదేశ్‌ కు ప్రాతినిధ్యం వహిస్తూ అతను కేవలం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే ఆడాడు, 22 పరుగులు చేశాడు. ఆర్యమాన్ ను తరువాత ఐపీఎల్ 2018 లో రాజస్థాన్ రాయల్స్ రూ.31 లక్షలకు తీసుకుంది. సీకే నాయుడు ట్రోఫీ లో 11 ఇన్నింగ్స్‌ లు ఆడాడు. ఆరు మ్యాచ్‌ లలో 79.50 సగటు తో 795 పరుగులు చేశాడు.మధ్యప్రదేశ్​ తరఫున రంజీలో ఆడి నాలుగు సెంచరీలు కూడా చేశాడు.