Begin typing your search above and press return to search.

అధ్యక్ష ఎన్నికల వేళ.. ఒబామా ఏం చేస్తున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   3 Nov 2020 11:40 PM IST
అధ్యక్ష ఎన్నికల వేళ.. ఒబామా ఏం చేస్తున్నారో తెలుసా?
X
అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన.. పేరుప్రఖ్యాతులతో పాటు అమెరికాను సక్సెస్ ఫుల్ గా నడిపిన అధ్యక్షుల్లో ఒకరుగా నిలుస్తారు బరాక్ ఒబామా. తాజాగా పోటాపోటీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళలో.. మాజీ అధ్యక్షుడిగా ఆయనేం చేస్తున్నారు? అన్న సందేహం కలుగక మానదు. మన రాజకీయాలకు.. అమెరికా రాజకీయాలకు ఏ మాత్రం పొంతన ఉండదు. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి పదవిలోకి వచ్చిన వారు ఏళ్లకు ఏళ్లు కొనసాగే అవకాశం ఉంటుంది. అమెరికాలో మాత్రం అలా కాదు. ఏ దేశాధ్యక్షుడు సైతం రెండు దఫాల తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అక్కడి రాజ్యాంగం ఒప్పుకోదు.

అందుకే ఎంత సక్సెస్ ఫుల్ అధ్యక్షుడైనా రెండు దఫాలు పదవిని చేపట్టిన తర్వాత.. కుర్చీని ఖాళీ చేయాల్సిందే. ఒబామా సైతం మినహాయింపు కాదు. తాజాగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఓటర్లకు నేరుగా ఫోన్ చేసి.. వారిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని.. తెలిసిన వారికి తన తరఫున ఓటు వేయాలని కోరాలన్నారు.

ఒబామా లాంటి నేత నుంచి స్వయంగా ఫోన్ రావటంతో సదరు మహిళ విపరీతమైన ఆశ్చర్యానికి.. ఆనందానికి గురి కావటమేకాదు.. తనకు హార్ట్ అటాక్ వస్తుందన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్..కమలాకు ఓట్లు వేయాలని ఒబామా కోరారు. వారి ఫోన్ సంభాషణ సమయంలో చిన్నారి మాటలు వారి సంభాషణకు అడ్డుగా రావటంతో.. ఎవరని ఆసక్తిగా ప్రశ్నించారు. తన ఎనిమిది నెలల కుమారుడు.. తాను ఎవరితోనైనా మాట్లాడితే.. ఇలా చేస్తుంటాడని ఆమె పేర్కొన్నారు.

అతను ఆకలితో ఉన్నాడా? డైపర్ మార్చాల్సి ఉందా? తల్లి కోసం మారాం చేస్తున్నాడా? తన తల్లి ఎవరితోనూ మాట్లాడకూడదని అనుకుంటున్నాడా? అంటూ సరదాగా మాట్లాడిన ఒబామా మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించిన నేత.. ఇంత సింఫుల్ గా మాట్లాడటం విశేషంగా చెబుతున్నారు. తన ప్రచారానికి ఆయన ఫోన్ బ్యాంకింగ్ అన్న కొత్త మాటను వాడటం విశేషం. వీలైనంత మందిని ఫోన్ ద్వారా పలుకరిస్తూ..పార్టీకి సేవ చేస్తున్న ఒబామా కారణంగా.. ఓటర్లు ప్రభావితం కావటం ఖాయం. అందుకేనేమో.. తన ఫోన్ ప్రచారానికి ఫోన్ బ్యాంకింగ్ అన్న థియరీని ఆయన చెబుతున్నారు. మన దగ్గర కూడా ఇలా ఎవరైనా చేస్తారా? తన కుటుంబ సభ్యులు.. బంధువులు కాకుండా కేవలం పార్టీ నిర్ణయించిన నేత కోసం అధ్యక్షుడిగా రెండు దఫాలు పని చేసిన అధినేత ఇంత సింఫుల్ గా ప్రచారం చేయటం ఒబామాకు మాత్రమే సాధ్యమేమో?