Begin typing your search above and press return to search.

ఎంఐఎం నెక్స్ట్ టార్గెట్ ఏమిటో తెలుసా ?

By:  Tupaki Desk   |   12 Nov 2020 7:00 AM IST
ఎంఐఎం నెక్స్ట్ టార్గెట్ ఏమిటో తెలుసా ?
X
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల్లో గెలిచి మంచి ఊపు మీదున్న ఎంఐఎం పార్టీ తన తర్వాత టార్గెట్ గా పశ్చిమ బెంగాల్ ను పెట్టుకుంది. 2015 బీహార్ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలిచిన పార్టీ తాజా ఎన్నికల్లో 5 సీట్లలో విజయం సాధించింది. అంతకుముందు మహారాష్ట్రలోను, ఉత్తరప్రదేశ్ లో కూడా కొన్ని సీట్లలో గెలిచింది. దాంతో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మంచి ఊపుమీదున్నారు.

దశాబ్దాల పాటు కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఈ పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ఫలితాలే రాబడుతోంది. అందుకనే ఇదే ఊపును కంటిన్యు చేయటంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. బీహార్లో 20 స్ధానాల్లో పోటీ చేసిన తమ పార్టీ ఐదు నియోజకవర్గాల్లో గెలవటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ పైన నిప్పులు చెరిగారు. తమను ఓడించటానికే ఎంఐఎం పోటీ చేసిందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఎంపి తోసిపుచ్చారు. తమ పార్టీ గెలవటాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నట్లు మండిపడ్డారు. సీమాచంల్ ప్రాంతంలో మహాగట బంధన్ అభ్యర్ధులు కేవలం 9 సీట్లలో మాత్రమే గెలిచిన విషయాన్ని అసద్ గుర్తుచేశారు. ఎన్నికల్లో తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ఎంఐఎం పార్టీపై నిందలు వేస్తున్నట్లు కొట్టిపారేశారు.

కాంగ్రెస్ నేతల్లోనే కొందరు తమ పార్టీ బీహార్లో ఫెయిలయినట్లు అంగీకరించిన విషయాన్ని అసద్ గుర్తు చేస్తున్నారు. మా అభ్యర్ధులు పోటీ చేసినా ఎన్డీయే అభ్యర్ధులు గెలిచినపుడు ఎంజీబీ అభ్యర్ధులు ఎందుకు గెలవలేకపోయారంటు అసద్ వేసిన ప్రశ్నకు మరి ఎవరు సమాధానం చెబుతారో.