Begin typing your search above and press return to search.
ఏపీలో ‘లాటరీ ఎమ్మెల్యే’ అంటే తెలుసా?
By: Tupaki Desk | 31 Aug 2020 2:20 PM ISTవైసీపీ తరుఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినా.. అందులో ఎంతమంది యాక్టివ్.? ఎంత మంది కొత్తవారు. ? ఎందుకు అందరూ స్తబ్దుగా ఉంటున్నారు. కొందరి పేర్లు అయితే ఇప్పటికీ తెలియవు. ఇక మంత్రులు కూడా కొత్త ముఖాలే. అంతా కొత్తవాళ్లు ఉంటే ఏంటి నష్టం అనుకుంటున్నారా? రాజకీయ అనుభవం లేకపోతే రాజకీయాల్లో రాణించడం.. ప్రజలతో కలిసిపోవడం ఎంత కష్టమో ఇప్పుడు ఆ నేతలకు , వైసీపీ అధిష్టానానికి అవగతమవుతోందట.. కొత్త ఎమ్మెల్యేల అసమర్థతపై ఇప్పుడు ఏపీలో సోషల్ మీడియాలో, వైసీపీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఏపీలో కొంత మంది ఎమ్మెల్యేలను కొత్త పేర్లతో పిలుస్తున్నారట.. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు ఇలా వ్యాఖ్యానిస్తున్నారట.. ఈ పదం ఆ నోటా ఈ నోటా విని వాళ్ల నియోజకవర్గాల్లో కూడా అలా పిలవడం మొదలైందట..
అసలు విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో జగన్ కష్టంతోనే రాష్ట్రంలో వైసీపీ గాలి బలంగా వీచి అత్యధిక మెజార్టీతో గెలవగలిగింది. ఈ ధాటికి టీడీపీ 4-5 సార్లు గెలిచిన వాళ్లు కూడా సామాన్యుల చేతుల్లో ఓడిపోయారు.. మొట్టమొదటిసారి నిలబడిన వారు.. కొందరైతే వాళ్ల పేర్లు కూడా సరిగా వినపడని అభ్యర్థులు సైతం జగన్ గాలిలో గెలవగలిగారు.
అయితే మొట్టమొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు.. అధికారులతో సరిగా మాట్లాడలేక పనులు చేపించలేక.. ముఖ్యమంత్రి దగ్గరికి పోయే దమ్ము లేక.. నియోజకవర్గంలో నేతలను గుర్తుపట్టలేక సతమతమవుతున్నారట.. ఈ ఎమ్మెల్యేలకు ‘లాటరీ ఎమ్మెల్యే’లు అని సీనియర్లు పేరు పెట్టారంట.. వాళ్ల వల్ల వచ్చే ఎన్నికలనాటికి ఏమీ లాభం లేదని భావిస్తున్నారట.. ఆ నియోజకవర్గంలో ఉన్న నేతలు సైతం మా ఎమ్మెల్యే ‘లాటరీ ఎమ్మెల్యే’నే అని.. వచ్చేసారి సీటు రాదు అని అనుకుంటున్నారట..
ఈ విధంగా ఏపీలో రాజకీయాల మీద ఎక్కువ అవగాహన ఉన్నవారు, సీనియర్లు టీ , కాఫీ షాపుల్లో కూర్చొని ఏదో ఒక విధంగా రాజకీయ రంగులు పూసి ఇలాంటి కొత్త కొత్త పేర్లను వైసీపీ డమ్మీ ఎమ్మెల్యేలను పెడుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో రాజకీయాలు చేయాలంటే అంతా ఈజీ కాదని కూడా మాట్లాడుకుంటున్నారు.. అదీ సంగతన్న మాట.