Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ ఎలా ఉంటుందో తెలుసా?

By:  Tupaki Desk   |   14 Sept 2020 12:00 PM IST
కరోనా వైరస్ ఎలా ఉంటుందో తెలుసా?
X
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఎలా ఉంటుందో తెలుసా? ఇంతమందిని రోగాల పాలు చేసిన వైరస్ ఏ ఆకారంలో ఉంటుంది? పేపర్లు, చానెల్స్ లో లాగా బుడిపెలుగా ఉంటుంది? ఇన్నాళ్లు అంతుచిక్కని ఈ వైరస్ కణాల ఫొటోలను తాజాగా శాస్త్రవేత్తలు తీశారు. వాటిని ప్రచురించారు.

కరోనా వైరస్ సోకిన శ్వాసకోశ ఫొటోలను శాస్త్రవేత్తలు తాజాగా తీశారు. ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్ కణాలు ఏ మేరకు చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపించింది ఈ చిత్రాల్లో గుర్తించారు.

శ్వాసకోశ మార్గంలో ఎంతటి తీవ్రతతో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందనేది సులభంగా అర్థమయ్యేలా పరిశోధకులు ఈ చిత్రాలను విడుదల చేశారు.

మానవ శ్వాసనాళాల్లో పెద్దసంఖ్యలో వైరస్ కణాలు శరీరమంతా వ్యాపించడంతోపాటు ఇతరులకు సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు కళ్లకు కట్టారు.

మానవ శ్వాసనాళాల్లో కరోనా వైరస్ ను ప్రవేశపెట్టి 96 గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా కరోనా కణాలను పరిశీలించారు. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ లో ఈ చిత్రాలు ప్రచురితమయ్యాయి. మాస్కుల ద్వారానే కోవిడ్ ను నియంత్రించవచ్చని ఈ పరిశోధన ద్వారా తేలిందన్నారు.