Begin typing your search above and press return to search.
‘దోశ’ పుట్టిళ్లు ఏదో తెలుసా.. వీటికి 2000 సంవత్సరాల చరిత్ర!
By: Tupaki Desk | 31 Oct 2020 5:00 AM ISTనీకిష్టమైన ఆహార పదార్థము ఏదీ అని ఎవరిని అడిగినా మెజారిటీ జనం చెప్పే సమాధానం దోశ. అది ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. సంవత్సరంలో 365రోజులు దోశెను లొట్టలేసుకుంటూ తినేవారు ఉన్నారు. దోసెల కూడా రకాలు లెక్కకు మించి ఉన్నాయి. ఓ ప్రాంతంలో ఒక్కో స్టైల్ లో దోసెలు వేసుకుని తినడానికి భారతీయులు ఎంతో ఇష్టపడతారు. దేశంలో అన్ని దోశెల కన్నా ఆలుతో చేసే మసాలా దోశె అంటే జనం ఎంతగానో ఇష్టపడతారు. దక్షిణభారతదేశ ప్రజలకు ఎంతో ప్రియమైన ఆహారపదార్థం దోశ. చాలా మందికి పొద్దున్నే అలా దోశ నోట్లో పడకపోతే ఏమి తోచదు.
రకరకాల చట్నీలతో, రకరకాల పేర్లతో, రకరకాల కాంబినేషన్లతో దోశలను ఆరగించడం దక్షిణాది ప్రజలకు అలవాటు. ఆనియన్ దోశ, మసాలా దోశ, ఎమ్మెల్యే దోశ, 70 ఎంఎమ్ దోశ పేరు ఏదైనా రుచి మాత్రం ప్రత్యేకం. ఫ్రెంచ్ వంటకం 'క్రేప్' లానో, రష్యా వంటకం 'బ్లీని' కూడా మన దోశలను పోలీ ఉంటాయి. మన దోశలను చూసే వాళ్లు కాపీ కొట్టారు అనే వాళ్లు ఉన్నారు. సాధారణంగా మినప్పప్పు, బియ్యం నానబెట్టి రుబ్బి, కాస్త 7 నుంచి 8 గంటలు పులిసిన తర్వాత దోశను వేస్తుంటారు.
2000 ఏళ్ల చరిత్ర
లక్షలమంది భారతీయులకు ప్రియమైన ఈ వంటకానికి రెండు వేల ఏళ్ల చరిత్ర ఉంది.
ఇప్పుడీ వంటకం విశ్వవ్యాప్తంగా విస్తరించింది. ఆలుగడ్డల కూరతో దీన్ని మసాలా దోశగా చేస్తారు. ఎన్నిదోశలు వచ్చినా మసాలా దోశ ప్రత్యేకత మాత్రం ఎక్కడికీ పోలేదు. ఆనియన్ దోశ కోసం క్యూలు కట్టే ఆహారప్రియులు కూడా ఉన్నారు. దోసెల కోసమే ప్రత్యేక హోటళ్లు ఎన్నో వెలిసాయి.అందులో ఓన్లీ రకరకాల దోశెలు వేస్తారు.
దోశ పుట్టిళ్లు ఏది?
దోశ పుట్టిళ్లు ఎక్కడ అన్న విషయంపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. సాహిత్యంలో లభిస్తున్న ఆధారాల ప్రకారం ఈ వంటకానికి 2000 ఏళ్ల చరిత్ర ఉన్నది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు ఎవరికి వారు ఈ వంటకం మాదేనంటూ చెప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కూడా దోశెలు మహా ఇష్టంగా తీసుకుంటారు. ఈ ప్రాంతాల్లోనూ విభిన్న రకాల్లో దోశెలు వేస్తుంటారు. కర్ణాటకకు చెందిన మూడో సోమేశ్వర రాజు 12 వ శతాబ్దంలో సంస్కృతంలో రచించిన ‘మానసోల్లాస’ పుస్తకంలో 'దోశక ’ ప్రస్తావన ఉన్నది. దోశను పోలిన మెల్ అడయి, అప్పం లాంటి వంటకాలను అంతకు పూర్వం నుంచే తమిళ నాట వండుతున్నారు.
ఈ వంటకాల గురించి 3, 4వ శతాబ్దానికి చెందిన సంగం కాలం నాటి సాహిత్యమైన మదురైకంచిలో ప్రస్తావన ఉన్నట్లు దక్షిణ భారత చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. దోశ పుట్టినిళ్లు ఎక్కడ అనే విషయంపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. కానీ కర్ణాటకలోని ఉడిపి చెందిన వంటమనుషులు దోశలను బాగా చేస్తారు. వారికి మనదేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్నది. ఇప్పటికీ పలు చోట్ల ఉడిపి హోటళ్లు ఉండగం మనం గమనిస్తుంటాం. ఇప్పటికే మంచి దోశలు బెంగళూరు హోటళ్లలోనే దొరుకుతాయి.