Begin typing your search above and press return to search.

అమెరికాలో చదువుతున్న మన విద్యార్ధుల లెక్క తెలుసా ?

By:  Tupaki Desk   |   8 April 2022 5:28 AM GMT
అమెరికాలో చదువుతున్న మన విద్యార్ధుల లెక్క తెలుసా ?
X
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లెక్కల ప్రకారం అమెరికాలో చదువుకుంటున్న మొత్తం భారతీయుల సంఖ్య 2,32,851. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 2021లో మన వాళ్ళ సంఖ్య ఏకంగా 12 శాతం పెరిగిపోయింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్ధుల్లో మొదటి స్థానం చైనాదే. తర్వాత స్ధానంలోనే మనవాళ్ళుండేవాళ్ళు.

అయితే తాజా లెక్కల ప్రకారం చైనా, భారత్ ను వెళ్ళిన విద్యార్ధుల సంఖ్య తలకిందులైంది. 2021 లెక్కల ప్రకారం చైనా నుండి అమెరికాకు 33,569 మంది విద్యార్థులు తగ్గిపోయారు.

ఇదే సందర్భంలో భారత్ నుండి 25,391 మంది విద్యార్ధులు పెరిగారు. ఈ లెక్కలను అంతకుముందు సంవత్సరాలతో పోల్చి చూశారు. అమెరికాలో చదుకుంటున్న విద్యార్ధుల్లో 37 శాతం మహిళలే ఉంటున్నారు. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్ధుల్లో 71 శాతం చైనా, భారత్ దే ఉంటుంది.

అగ్రరాజ్యంలో వివిధ యూనివర్సిటీల్లో కోర్టుల్లో చదువుకునేందుకు ప్రపంచంలోని 224 దేశాల నుండి ప్రతి ఏడాది విద్యార్థులు వస్తున్నారు. వీరిలో 2,08,257 మంది కాలిఫోర్నియా యూనివర్సిటీలోనే చేరారు. 2021లో అమెరికాలో డిగ్రీలు తీసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 11,42,252. ఛైనా, భారత్, దక్షిణ కొరియా, కెనడా, బ్రెజిల్ , వియత్నాం, సౌదీ అరేబియా, తైవాన్, జపాన్, మెక్సికో దేశాల నుండే అత్యధికంగా అమెరికాకు వెళుతున్నారు చదువుకులకోసం.

ఇక్కడ గమనించాల్సిందేమంటే అమెరికాలో చదువుకునేందుకు వెళ్ళే విద్యార్ధుల సంఖ్య ఛైనా నుండి ఎందుకు తగ్గింది ? భారత్ నుండి ఎందుకు అంతలా పెరిగింది. అమెరికాలో పౌరసత్వం తీసుకున్న విదేశీయుల లెక్కలు తీసుకుంటే భారత్ కన్నా ఛైనా వాళ్ళే ఎక్కువ. దశాబ్దాలుగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో చైనా వాళ్ళదే ఆధిపత్యం.

కోవిడ్ మహమ్మారి సమయంలో అమెరికాలో చైనా వాళ్ళతోనే ఎక్కువ సమస్యలు వచ్చినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. మరిలాంటి అవకాశాలను ఛైనా వాళ్ళు ఎందుకు వదులుకుంటున్నారో అర్ధం కావటంలేదు. ముందు చదువుకునేందుకు వస్తారు తర్వాత ఉద్యోగం పేరుతో సెటిల్ అయిపోతున్న వాళ్ళే ఎక్కువ.