Begin typing your search above and press return to search.

ముద్దుతో కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

By:  Tupaki Desk   |   14 Feb 2021 4:00 PM IST
ముద్దుతో కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
X
ముద్దుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చాలా అధ్యయనాల్లో తేలింది. ముద్దులు పెట్టుకోవడం వల్ల కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని వెల్లడైంది. కరోనా గత ఏడాది ప్రపంచాన్ని ఆవహించాక ఓ షేక్ హ్యాండ్ లేదు.. హగ్ లేదు.. ఇక ముద్దూ మురిపాలు కూడా లేకుండా పోయాయి. ఈ కరోనా మహమ్మారి చేయబట్టి సరిగ్గా రోమాన్స్ కూడా చేయడానికి భయం వేస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ జనాలు నెట్టుకొస్తున్నారు.

అయితే కరోనా తగ్గడంతో ఇప్పుడు మరోసారి రోమాన్స్ తో ఊరట చెందుతున్నారు ప్రేమ పక్షులు.. రోమాంటిక్ లో ప్రధానంగా అందరూ కావాలనుకునేది ముద్దు. ముద్దుతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.

ముద్దుతో రోగ నిరోధక శక్తిని పెరుగుతుందని తేలింది. ఒత్తిడి, ఆందోళన, తలనొప్పిని తగ్గిస్తుందని నిరూపితమైంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుందని పరిశోధనలో తేలింది.

ప్రధానంగా ముద్దు వల్ల ముఖాల కండరాల్లో కదలిక వస్తుందని తేలింది. కేలరీలను కరిగిస్తుందని.. ఆయుష్షును పెంచుతుందని తేలింది. ఇవన్నీ ఆయా సర్వేల్లో నిరూపితమయ్యాయి. ఇక ముద్దులతో రెచ్చిపోవడమే ప్రేమికులకు మిగిలింది.