Begin typing your search above and press return to search.
హోమియోపతి, ఆయుర్వేదం తేడాలు తెలుసా?
By: Tupaki Desk | 1 Aug 2020 9:45 AM ISTకరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసంతో పాటు వివిధ అంశాల కోసం హోమియోపతి, ఆయుర్వేదానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. రోగనిరోధకశక్తి పెంచుకోవడం కోసం ఇప్పుడు చాలామంది పాలలో పసుపు వేసుకొని తాగడం, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన కషాయం తీసుకోవడం, మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క, చింతపండు, తులసి వంటి వంటింటి వైద్య విధానంతో ఇమ్యూనిటీ పెరుగుతుందని కొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలకు ప్రాధాన్య సంతరించుకుంది. మన దేశంలో ఎంతోమంది ఈ రెండు వైద్య విధానాలను అనుసరిస్తారు. ఇంగ్లీష్ మందు తర్వాత హోమియోపతికి ప్రాధాన్యతనిస్తారు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని వాదనలు ఉన్నాయి. ఆయుర్వేదానికీ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.
ప్రపంచంలో అతిపురాతన వైద్య విధానం ఆయుర్వేదం. ఐదువేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. హోమియోపతికి 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ రెండు వైద్య పద్ధతులు కూడా సమస్యకు కారణాన్ని గుర్తించగలవు. ఆ సమస్యను మాత్రమే పరిష్కరించడంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వీటి వల్ల ఫలితం వెంటనే ఉండదు. కాస్త సమయం తీసుకుంటుంది. ఈ రెండింటిలో ఏ వైద్యమైనా ముందు జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం.
వైద్యం కోసం తమ వద్దకు వచ్చేవారి జీవిత చరిత్ర, వైద్య పరిస్థితుల్ని తెలుసుకొని హోమియో డాక్టర్లు అందుకు అనుగుణంగా చికిత్స ప్రారంభిస్తారు. ఈ మందులు సహజ వస్తువల నుండి తయారవుతాయి. మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కలిగించదని విశ్వసిస్తారు. ఒత్తిడి, దీర్ఘకాలిక అలసట, పేగు, కడుపులో మంట వంటి సాధారణ వ్యాధులకు హోమియోపతి వైపు చూస్తారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి నయం కోసం మాత్రం దీనిని పరిగణలోకి తీసుకోరు. రెండు శతాబ్దాలకు ముందు పుట్టిన ఈ పద్ధతి కాలక్రమేణా కొన్ని మార్పులు చెందింది. హోమీయోపతికి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పినప్పటికీ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. పేద దేశాల్లో, పేద, మధ్య తరగతి ప్రజల్లో దీనికి ఆదరణ ఎక్కువ. అక్షరాస్యుల్లో దీనిపై ఆసక్తి తక్కువ. నిరక్షరాస్యుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ మందులతో, ఆయుర్వేదంతో పోలిస్తే ఖరీదు తక్కువ. కాబట్టి భారత్ సహా పలు దేశాల్లో దీనికి ఆదరణ ఉంది. సరైన మందు వేసుకుంటే గుణం కనిపిస్తుందని, ఇది తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉంటుందని చాలామంది విశ్వాసం. ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారు చేస్తారు. రసాయనాలు ఉండవు.
ఓ అధ్యయనం ప్రకారం ఆయుర్వేదం గాలి, నీరు, అగ్ని, భూమి అంశాలతో అనుసంధానించబడిందనే నమ్మకం ఏర్పడింది. ఇది మనస్సు, శరీరం, ఆత్మల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం. దీని ముఖ్య ఉద్దేశ్యం సంపూర్ణ ఆరోగ్యం. ఈ వైద్య విధానంలో మన శరీరంలోని హానికర, జీర్ణంకాని ఆహారాన్ని శుద్ధి చేసుకోవచ్చునని భావిస్తారు. వ్యాధి తీవ్రత, లక్షణాలు తగ్గించేందుకు, శరీర సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ వైద్య విధానం ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇది మన దేశంలో అతిపురాతన వైద్యం. ఆధునిక కాలంలో కొంత వెనుకబడినా, మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం కూడా ఉంది. మొండి వ్యాధుల్ని కూడా నయం చేసే శక్తి ఉందనే విశ్వాసం కొంతమందిలో ఉంటుంది. ఇందులో పంచకర్మ బాగా ప్రసిద్ధి చెందింది. కండరాలు, నరాలకు సంబంధించిన అనేక వ్యాధులకు చికిత్స చేయవచ్చు. ఈ చికిత్సలో మసాజ్, రకరకాల నూనెలు, సహజ వనమూలికలు ఉపయోగిస్తారు.