Begin typing your search above and press return to search.
సమాచార హక్కు చెప్పిన నిజం.. ఈ ఏడాది క్యాన్సిల్ అయిన టికెట్లు ఎన్నో తెలుసా?
By: Tupaki Desk | 2 Nov 2020 10:00 AM ISTతాము వెళ్లాల్సిన ఊరికి రైలు సౌకర్యం ఉంటే.. తొలి ప్రాధాన్యత ట్రైన్ కే ఇవ్వటం చాలామంది చేస్తుంటారు. తాము వెళ్లాల్సిన ప్రాంతానికి ముందుస్తుగా రిజర్వేషన్ చేసుకోవటం చాలామందిలో చూస్తుంటాం.అయితే.. సీటు.. బెర్తు లేని కారణంగా టికెట్లు క్యాన్సిల్ అవుతుంటాయి. ఇలా క్యాన్సిల్ అయ్యే టికెట్లు ఎన్ని అన్న లెక్క తెలిస్తే షాక్ తినటం ఖాయం. తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా.. రిజర్వేషన్ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోవటం వల్ల క్యాన్సిల్ అయిన వాటికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.
ప్రయాణికుల అవసరాల్ని రైల్వేలు ఏ మాత్రం తీర్చలేకపోతున్న నిజం తాజాగా బయటకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 1.25 కోట్ల టికెట్లు వెయిటింగ్ లిస్టు కారణంగా రద్దు చేసుకున్నట్లుగా తేల్చారు. 2019-2020 ఏడాదిలో కోటికి పైగా ప్రయాణికులు సీట్లు.. బెర్తులు రిజర్వ్ కాకపోవటం వల్ల తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి దాఖలు చేసిన దరఖాస్తుతో ఈ చేదు నిజం బయటకు వచ్చింది.
ఈ లెక్క చూస్తే.. రైలు ప్రయాణం కోసం ప్రజల అవసరాలకు.. ప్రభుత్వం కల్పిస్తున్న వసతికి మధ్య అంతరం ఎంత భారీగా ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. గడిచిన ఐదేళ్లలో వెయిటింగ్ లిస్టు కారణంగా ఆటోమేటిక్ గా రద్దు అయిన టికెట్లు ఏకంగా ఐదు కోట్లు దాటినట్లుగా తేల్చారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగటం.. వారి అవసరాలకు తగ్గట్లుగా కొత్త రైళ్లను ఏర్పాటు చేయకపోవటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యను అధిగమించేందుకు ప్రైవేటు రైళ్ల కాన్సెప్టును తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. భారీగాఅవకాశాలు ఉన్న వేళ.. ప్రభుత్వమే మరిన్ని రైళ్లను పట్టాల మీదకు ఎక్కిస్తే సరిపోయేదిగా? అద్భుతాలు చేస్తానని చెప్పే ప్రభుత్వాలు.. ప్రజల అవసరం ఇంతలా ఉన్న రైల్వేలను తనకు తానుగా నిర్వహించలేదా? దానికి ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరా? అన్నది ప్రశ్న.