Begin typing your search above and press return to search.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

By:  Tupaki Desk   |   3 Jun 2021 12:00 PM IST
క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?
X
ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్‌ క‌ల‌క‌లం సృష్టిస్తుంటే మ‌రోవైపు త్వరలోనే కరోనా థర్డ్‌వేవ్‌ కూడా రానున్నట్లు అంచనాలు వెలువ‌డుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలోనే ఈ థ‌ర్డ్ వేవ్ గురించి ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. క‌రోనా సెకండ్ వేవ్ వ‌లే మూడో వేవ్‌ తీవ్రంగా ఉండే అవకాశముందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన నివేదికలో పేర్కొంది. ఇది 98 రోజులపాటు కొనసాగవచ్చని తెలిపింది. అంతేకాకుండా ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర అంశాల‌ను వివ‌రించింది.

కరోనా థర్డ్‌వేవ్‌పై ఎస్‌బీఐ ఎకోరాప్‌ పేరిట విడుదల చేసిన రిపోర్టులో ఆశ్చ‌ర్య‌క‌ర వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ తరహాలోనే థర్డ్‌వేవ్‌ కూడా అంతే తీవ్ర ప్రభావం చూపవచ్చునని పేర్కొంటూ థర్డ్‌వేవ్‌ ప్రభావం, దాని లక్షణాలు, ఎన్ని రోజులు ఉండవచ్చు అనే పలు అంశాలను నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ను 108 రోజులు ఉండగా.. దానికంటే 10 రోజులు తక్కువగా థర్డ్‌వేవ్‌ ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా పరిస్థితులను బట్టి చూస్తే కరోనా థర్డ్‌వేవ్‌ సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే పీక్‌ స్థాయిలో 1.8 రెట్లు అధికంగా ఉండవచ్చునని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. కరోనా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌వేవ్‌ 5.2 రెట్లు అధికంగా ఉంది. థర్డ్‌వేవ్‌ దాదాపు 98 రోజుల పాటు ఉండవచ్చు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో థర్డ్‌వేవ్‌ ప్రభావం దాదాపు ఇంతే సమయం ఉందని తెలిపింది.

క‌రోనా సెకండ్‌వేవ్‌ మరణాలతో పోలిస్తే థర్డ్‌వేవ్‌కు సంబంధించి ఇప్పుడే అప్రమత్తమై చర్యలు తీసుకుంటే మరణాలు తగ్గించవచ్చునని సూచించింది. థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తుగా సిద్ధమై ఉండాలని, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించింది. తద్వారా సీరియస్‌ కొవిడ్‌ కేసులను కూడా సులభంగా ఎదుర్కోగలమని, ఆక్సిజన్‌, బెడ్లు, ఐసీయూల అవసరం భారీగా తగ్గుతుందని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. అంతేగాక కరోనా మరణాలను కూడా భారీగా తగ్గించవచ్చని వెల్లడించింది. ‘థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి వాళ్లను దృష్టిలో ఉంచుకొని మనం వ్యూహాలు రూపొందించుకోవాలి. కొన్ని దేశాలు పిల్లలకు టీకాలు వేయడానికి భారీగా వ్యాక్సిన్లను కొనుగోలు చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ముందస్తుగా టీకాలను కొనుగోలు చేసుకోవడం మంచింది’ అని ఎస్‌బీఐ వివరించింది. ఈ విష‌యంలో మ‌రి పాల‌కులు ఎలాంటి నిర్ణంయ తీసుకుంటారో!