Begin typing your search above and press return to search.

భారత్ లో గూగుల్ పెట్టుబడి ఎన్ని కోట్లో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Feb 2021 11:00 PM IST
భారత్ లో గూగుల్ పెట్టుబడి ఎన్ని కోట్లో తెలుసా?
X
భారత్ పై ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ ఆవాజ్య ప్రేమ చూపించింది. ఏకంగా కోట్ల పెట్టుబడులు కొట్టింది. భారత్ లో సూక్ష్మ, చిన్నతరహా సంస్థల్లో సుమారు రూ.109 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రకటించింది.
స్థానిక సంస్థల భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతామని ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం వల్ల గూగుల్ చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ప్రకటించింది.

ఇందులో భాగంగా భారత్ లో వినియోగదారుల లక్ష్యాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించనుంది. గూగుల్ భారత్ లోని పలు కంపెనీలతోనూ టై అప్ అయ్యింది. ఇప్పటికే దేశీయ టెలికాం దిగ్గజం జియోతోనూ గూగుల్ జట్టు కట్టింది. పెట్టుబడులు పెట్టింది.

135 కోట్ల భారత్ జనాభాలో అపార అవకాశాలు ఉన్నాయి. వాటిని క్యాష్ చేసుకునేందుకు దిగ్గజ కంపెనీలన్నీ భారత్ లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, అమేజాన్ వంటి సంస్థలు ముందుకు రాగా తాజాగా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కూడా ముందుకొచ్చింది.