Begin typing your search above and press return to search.
కరోనా ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందో తెలుసా? తాజా సర్వేలో గుడ్న్యూస్
By: Tupaki Desk | 5 Nov 2020 5:00 AM ISTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై రోజుకో కొత్త అధ్యయనం బయటకు వస్తోంది. అంతుచిక్కని ఈ వ్యాధి మనుషులపై ఎలా దాడి చేస్తుంది.. అనే విషయంపై నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు చాలా కంపెనీలు కృషిచేస్తున్నాయి. అయితే కరోనా మహమ్మారిపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని గుర్తించారు.కరోనా వచ్చిన రోగికి ఆరునెలల తర్వాత కూడా రోగనిరోధకశక్తి కనిపిస్తున్నదని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కరోనా వచ్చాక శరీరంలో వస్తున్న మార్పులు, రోగనిరోధక శక్తి పరిమాణం, కాలవ్యవధి తదితర విషయాలపై నిత్యం పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. కరోనా వచ్చినవారికి సాధారణంగా సెల్యులర్ ఇమ్యూనిటీ (కణసంబంధ రోగనిరోధకత) అభివృద్ధి చెందుతుంది. ఇలా ఏర్పడ్డ ఇమ్యూనిటీ సదరు రోగిలో ఆరునెలలపాటు ఉంటుంది. అంటే ఒకసారి కరోనా వచ్చినవాళ్లకు ఆరునెలల వరకు ఈ వ్యాధి వచ్చే అవకాశం లేదు. కానీ శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన పరిశోధన ప్రకారం ఆరునెలల తర్వాత కూడా రోగిలో ఇమ్యూనిటీ కనిపిస్తున్నది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలందరికీ ఇది గుడ్న్యూస్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రిటన్‌లో జరిపిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైందని ప్రొఫెసర్ పాల్ మోస్ తెలిపారు. కాగా, కొవిడ్-19 అనే పజిల్‌లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే తాము పరిష్కరించగలిగామని.. ఈ వ్యాధికి సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నదని ఆయన చెప్పారు. కొందరు కరోనా బాధితులపై బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆరునెలల అనంతరం వారిలో కొందరి యాంటీబాడీల స్థాయి తగ్గినప్పటికీ.. సెల్యులార్ ఇమ్యూనిటీలో భాగమైన టీ- కణాలు స్పందించే తీరు స్థిరంగానే ఉందని వారు వెల్లడించారు.