Begin typing your search above and press return to search.

ఇందిరాగాంధీ హంతకులను ఎలా చంపారో తెలుసా?

By:  Tupaki Desk   |   6 Jan 2022 9:00 PM IST
ఇందిరాగాంధీ హంతకులను ఎలా చంపారో తెలుసా?
X
ఇందిరమ్మ..... భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తికి ఈమె పేరు తెలిసే ఉంటుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇందిరా గాంధీ. జవహర్ లాల్ నెహ్రూ కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తనదైన శైలిలో దేశాన్ని నడిపించిన వ్యక్తిగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేశాన్ని ముందుకు నడిపించాలి అనే తపనతో ముందడుగు వేశారు. దేశ భద్రత రక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అంతేకాకుండా దేశ ప్రజలకు కనీస అవసరాలు అయిన రోటీ, కపడా , మకాన్ లను అందించాలని కలలు కన్నారు.

అవి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందజేయాలని భావించారు. అందుకు తగిన చర్యలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. పేదోడికి పెట్టేడు అన్నం పెట్టడంలో విజయం సాధించారు ఇందిరా గాంధీ. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఒకే ఒక్క ఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది.

దీంతో సిక్కు మతస్తులు చాలామంది మనస్తాపానికి గురయ్యారు. చివరకు ఈ కారణంగానే ఆమెను తన ఆఫీసు లోనే కాల్చి చంపారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇందిరా గాంధీ ని కాల్చి చంపింది తన వెన్నంటే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది. ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఘటన తో వీరు మానసిక ఆందోళనకు గురైనట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకు అనుగుణంగానే ఇందిరాగాంధీ పై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఆమెను కాల్చి చంపినట్లు నిందితులు పేర్కొన్నారు.

అయితే ఇందిరా గాంధీపై కాల్పులు జరిపిన ఆ వ్యక్తి తో పాటు మరో వ్యక్తికి ఇదేరోజు ఉరి శిక్షను 1989 జనవరి ఆరో తేదీన అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందిరా గాంధీ హత్య కేసులో ప్రమేయం ఉన్నటువంటి ఇద్దరూ అధికారులను ఉరి తీసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వీరి పేర్లు సత్వంత్ సింగ్, కేహార్ సింగ్. ఈ ఇద్దరు ఇందిరా గాంధీకి వ్యక్తిగత భద్రతా సిబ్బంది గా ఉండేవారు. అయితే 1984 అక్టోబర్ 31న ఆమె నివాసంలో ఉండగా కాల్చిచంపారు.

వీరిలో సత్వంత్ సింగ్ మాత్రమే ఇందిరా గాంధీ పై కాల్పులు జరిపారు. మరో అధికారి బియాంత్ సింగ్‌ కూడా ఆమెను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. అయితే కేహార్ సింగ్ మాత్రం హత్యకు సంబంధించిన ప్రణాళిక రచించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన బియాంత్ సింగ్ ను మిగతా భద్రతా సిబ్బంది అక్కడికక్కడే కాల్చిచంపారు.

మిగిలిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా... దీనిపై సుదీర్ఘ కాలం పాటు వాదనలు జరిగాయి. అయితే చివరకు వీరికి మరణశిక్ష విధించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సరిగ్గా ఇదే రోజు అమలు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ పై కాల్పులు జరిపారు. ఆమె తన ఆఫీసు నుంచి బయటకు వచ్చి కొందరు అధికారులతో మాట్లాడుతుండగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ కాల్పులు జరిపిన వారిలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరూ భాగమైనట్లు దర్యాప్తులో తేలింది.

వీరిలో ఒకరు తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చగా.. మరొకరు మిషన్ గన్ తో సుమారు 25 రౌండ్ లకు పైగా కాల్పులు జరిపినట్లు తేలింది. అక్కడ ఉన్న మిగతా భద్రతా సిబ్బంది ఆమెనూ ఎయిమ్స్ కు తరలించారు. సుమారు నాలుగు గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఇందిరాగాంధీ చివరకు చనిపోయారు. ఇందిరాగాంధీ చనిపోయినట్లు మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులు ప్రకటించారు. దీనితో యావద్భారతం శోకసంద్రంలో మునిగిపోయింది.