Begin typing your search above and press return to search.

అంగస్తంభన సమస్య ఉందా..? ఇలా చేయండి.. సెట్ అయిపోద్ది..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 11:30 PM GMT
అంగస్తంభన సమస్య ఉందా..? ఇలా చేయండి.. సెట్ అయిపోద్ది..!
X
శృంగారం విషయంలో చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే వైద్యుడితో తప్ప ఎవరికీ చెప్పుకోవడానికి ఆసక్తి చూపరు. ప్రతీ సమస్య మెడిసిన్స్ తో పరిష్కారం అవుతుందని చెప్పలేమని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నింటికి ఎవరికి వారే ఆరోగ్య పద్ధతులు పాటించాలని అంటున్నారు. పురుషుల్లో అంగస్తంభన సమస్య అనివార్యం. చాలా మంది దీంతో బాధపడుతూ తీవ్ర నిరాశకు గురవుతారు. ఎంతో ఉత్సాహంతో శృంగారంలో పాల్గొనాలనుకునేవారికి దీంతో మానసికంగా కుంగిపోతారు.

అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని వ్యాయామాలు చేస్తే పరిష్కారం అవుతుందని కొందరు సూచిస్తున్నారు.ఒక అధ్యయనంలో 40 శాతం మంది వ్యాయామం నుండి ప్రయోజనం పొందినట్లు తేలింది. ఈ వ్యాయామం చేయడం వల్ల సాధారణ అంగస్తంభన పనితీరును తిరిగి పొందారు. అంతే కాకుండా 33.5 శాతం మంది పురుషులు అంగస్తంభన సమస్య నుంచి బయటపడ్డారు. అయితే ఆ వ్యాయామ వివరాలేంటో చూద్దాం..

కెగిల్ వ్యాయామం లైంగిక సమస్య నుంచి బయటపడేస్తుంది. పెల్విక్ కండరాలను బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది. పురుషులే కాకుండా మహిళలు సైతం ఈ వ్యాయామం చేయడం ద్వారా వారికున్న పలు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ వ్యాయామం చేయడం ద్వారా బుల్లో కావెర్నో సస్ కండరాలను బలోపేతం చేస్తుంది. దీనిని చేయడం వల్ల అంగస్తంభన సమయంలో పంపింగ్ చేయడంలోనూ, మూత్ర విసర్జన తర్వాత మూత్రాశయాన్ని ఖాళీ చేయడంలోనూ సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా రోజుకు రెండు, మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయి.

కెగిల్ వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. అలా కాదని ఒత్తిడికి లోనైతే శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది. ప్రారంభంలో వరుసగా 10 పునరావృతాలు పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయినా అలా చేయలేదని అనుకోకుండా ప్రశాంతంగా వ్యాయామం చేయండి. ఇలా చేయడం వల్ల పెల్విక్ ప్రాంతంలో కండరాలను బలోపేతం చేయడానికి సాయపడుతుంది.

కెగిల్ తో పాటు ఏరోబిక్ వ్యాయామం కండరాల పటిష్టానికి ఉపయోగపడుతుంది. ఏరోబిక్ వ్యాయామం ద్వారా అంగస్తంభన సమ్యస్యను అధిగమించవచ్చు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తూ ఏరోబిక్ వ్యాయామం చేయడం ద్వారా శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్ని వెబ్ సైట్లు హెర్బల్ సప్లిమెంట్స్ అంగస్తంభనను నయం చేయగలవనే మాటలను నమ్మొద్దు. ఆరోగ్య సమస్యను ఏదుర్కొన్నప్పుడు అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ఉండండి.. అదే మీకు రక్షణగా ఉంటుంది.

అంగస్తంభన సమస్య తో బాధపడేవారు పెద్దగా చింతాల్సిన అవసరం లేదు. దీనికి అనేక రకాలుగా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వైపు మెడిసిన్ తీసుకుంటూనే ఇలాంటి వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితాన్నిస్తాయి. అయితే వ్యాయామాలు చేసిన తరువాత కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోతే వైద్యుడిని సంప్రదించి అసలు కారణమేంటో తెలుసుకోండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.