Begin typing your search above and press return to search.

జంక్ ఫుడ్ తింటున్నారా? మీ ఆ సామర్థ్యం ఖతం

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:30 AM GMT
జంక్ ఫుడ్ తింటున్నారా? మీ ఆ సామర్థ్యం ఖతం
X
కాలం మారినా కొద్దీ బబ్బర్లు, గుడాలు, జొన్నలు, అవిసెలు, లాంటి మన పురాతన ఆహార పదార్థాలు మాయమై బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్ లు, నూడుల్స్ వంటి ఆధునిక పాశ్చాత్య వంటకాలు మన సమాజంలోకి వచ్చాయి. మన పప్పులు తింటే దేహానికి బలం.. ఆరోగ్యం.. ఈ పాశ్చాత్య బ్రెడ్డులు తింటే శరీరానికి హానికరం.. తొందరగా పైకి పోవడానికి ఈ తిండి మరింత బూస్ట్ నిస్తుంది.అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న వేళ మళ్లీ మన పురాతన వంటల వైపు అందరూ దృష్టి సారిస్తున్నారు.

ప్రస్తుతం మన ఆధునిక సమాజంలో మనిషి పనిలో పడిపోయి సరైన తిండి తినడం లేదు. ఆదరబాదరగా ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నాడు. అప్పటికప్పుడు ఏది దొరికితే అదే తింటున్నాడు.

అయితే జంక్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జంక్ ఫుడ్ అప్పటికప్పుడు రుచికరంగా అనిపిస్తుందని.. కానీ లాంగ్ రన్ లో వచ్చేటప్పటికీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జంక్ ఫుడ్ తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాల్సిందేనని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకునే పురుషుల వృషణాల పరిణామం తగ్గకపోవడంతోపాటు వారి వీర్యకణాల సంఖ్య కూడా భారీగా పడిపోతోందని హార్వర్డ్ యూనివర్సిటీ తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే జంక్ ఫుడ్ తీసుకునే వారిలో వీర్యకణాల సంఖ్య 26 మిలియన్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే జంక్ ఫుడ్ తో మీ పిల్లలు పుట్టే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని తేలింది.