Begin typing your search above and press return to search.

నిద్రపట్టని వారంతా ఇలా చేయండి

By:  Tupaki Desk   |   24 July 2019 5:03 AM GMT
నిద్రపట్టని వారంతా ఇలా చేయండి
X
రాత్రి 11 అవుతుంది.. బెడ్ పై వాలుతాం.. ఫోన్ పట్టుకుంటాం. నిద్ర రాదు.. టీవీ చూస్తాం.. అయినా రాదు.. అలా 12 గంటలు.. 1, 2 గంటలు ఇలా సమయం గడుస్తున్నా నిద్ర పట్టక బెడ్ పై దొర్లే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అస్తవ్యస్థ పనులు- ఒత్తిడి- ఇతర కారణాలతో మనిషికి ఇప్పుడు నిద్ర దూరం అవుతోంది. ఇప్పుడు అందరికంటే అదృష్టవంతులు ఎవరో తెలుసా.? టైంకు ఠంచునుగా నిద్ర పట్టేవారే అంటున్నారు వైద్యులు.

మరి నిద్రపట్టని వారి సంగతేంటని జుట్టు పీక్కోకండి.. దానికి ఇటీవల ఓ పరిశోధనలో చక్కటి ఉపాయాన్ని కనిపెట్టారు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిద్ర పట్టని 5322 మంది తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారిని పడుకోవడానికి సుమారు గంటన్నర ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలని సూచించారు. 40 నుంచి 43 డిగ్రీల వాంచిత ఉష్ణోగ్రత వారి బాడీకి గురవుతుంది. అలా చేసిన వారందరికీ త్వరగా నిద్ర పట్టిందట.. గోరువెచ్చటి నీటీతో స్నానం చేస్తే సాధారణం కంటే తొందరగానే నిద్ర పట్టడాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

ఇలా హాయిగా నిద్ర పట్టడానికి , వేడినీటి స్నానం ఉపయోగపడుతుందని.. శరీరంపై చెమట.. దురద పోయి స్వాంతన చేకూరి నిద్ర ఆవహిస్తోందని.. మనసు కూడా రిలాక్స్ అయ్యి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇప్పుడు ఈ వేడినీటి స్నానం, శరీర నిద్రకు గల సంబంధాలపై శాస్త్రీతయత కోసం లోతైన పరిశోధనను వారు చేస్తున్నారు.