Begin typing your search above and press return to search.

ఆలివ్ఆయిల్ ఎక్కువగా వాడేకయండి..!

By:  Tupaki Desk   |   25 Feb 2021 7:00 AM IST
ఆలివ్ఆయిల్ ఎక్కువగా వాడేకయండి..!
X
ఇటీవల ఆలివ్​ ఆయిల్​ వాడకం పెరిగిపోయింది. అయితే దీని వాడకం కూడా అంత మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. అయితే ఆలివ్​ ఆయిల్​ అందరికీ పడకపోవచ్చని డాక్టర్లు అంటున్నారు. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఆలివ్​ ఆయిల్​ వాడకపోవడమే బెటర్​ అని సూచిస్తున్నారు.

జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఆలివ్​ ఆయిల్​ను తీసుకుంటే చర్మ సమస్యలు వచ్చే అవాశం ఉందని డాక్టర్లు అంటున్నారు.

జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఈ ఆలివ్ ఆయిల్ ను వాడితే.. సీబం అధికంగా ఉత్పత్తి అయ్యి చర్మం ఎర్రబడుతుంది. అంతేకాక ఇతర చర్మసమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఆలివ్ ఆయిల్ లో ఒలియిక్ ఆమ్లం ఉంటుంది. దీనివల్ల చర్మంపై ఓ పొర ఏర్పడుతుందని .. తద్వారా మనం బయటకు వెళ్లినప్పుడు చర్మంపై దుమ్ము పేరుకుపోయే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.చిన్నపిల్లలకు కూడా వాళ్ల శరీరతత్వం ఏమిటో తెలియకుండా ఆలివ్​ ఆయిల్​ను విరివిగా వాడొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఆలివ్​ ఆయిల్​ వాడకం వల్ల విపరీతమైన అనారోగ్య సమస్యలు ఏమీ ఉండకపోచ్చు. అయితే అలర్జీలు లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి.. కొంచెం చూసుకొని వాడాలి.

ఆలివ్​ ఆయిల్​తో అంతులేని లాభాలు కూడా ఉన్నాయి. ఆహారంలోనే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఆలివ్​ ఆయిల్​ ఎంతో ఉపయోగపడుతుంది.

డైటింగ్​ చేసేవాళ్లు ఎక్కువగా ఆలివ్​ ఆయిల్​ వాడతారు.

జుట్టుసంరక్షణకు, చర్మ సంరక్షణకు కూడా ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుంది.

ఆలివ్​ ఆయిల్​ మంచిదే కానీ.. కానీ శరీర తత్వం , చర్మాన్ని బట్టి దీన్ని వాడుకుంటే సత్ఫలితాలు ఉంటాయి.