Begin typing your search above and press return to search.
సెక్స్ కోసం మహిళలను టార్చర్ పెట్టకండి..అన్నివేళలా వారి శరీరం అంగీకరించదు..!
By: Tupaki Desk | 24 Oct 2020 5:00 AM ISTశృంగారం కోసం భార్యలను టార్చర్ పెట్టే భర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేవలం ఈ విషయం మీదే విడాకులు తీసుకొనే వారున్నారు అంటే.. ఈ సమస్య తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు బాల్యవివాహాలు కూడా మహిళల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కేవలం 15 ఏళ్లకే ఎంతో మంది గర్భం దాల్చుతున్నారు. దీంతో భవిష్యత్‌లో వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతోంది. ఆఫ్టనిస్థాన్లో ఈ తరహా వేధింపులు పెరిగిపోతున్నాయి.భర్తలకు విధేయతతో ఉండాలనే ఆలోచనతో చాలామంది మహిళలు అయిష్టంగానే సెక్స్‌లో పాల్గొంటున్నారట.
''ఒకరి పట్ల విధేయతతో ఉండటం అంటే, వారికి మన మీద అధికారాలు ఇవ్వడం. భార్యాభర్తల బంధంలో భర్తకు భార్యతో గడపడానికి అధికారాలు ఉంటాయి. దీనికి భార్యమొహమాటపడకూడదు. భర్తతో వారించకూడదు. భర్తతో శారీరక సంబంధాన్ని నిరాకరించే భార్యకు విధేయత లేనట్లుగా పరిగణించాలని ఇస్లామిక్ మత చట్టాలు చెబుతున్నాయి'' అని కొందరు ప్రొఫెసర్లు చెబుతున్నారు.
స్త్రీల శరీరం అన్నివేళలా సెక్స్‌కు సిద్ధంగా ఉంటుందా? ఇందుకు సంబంధించి వైద్యులు ఏం చెబుతున్నారు.. నిజానికి తక్కువ అంతరంతో పిల్లలను కనడం వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటుంది. మహిళలు వెంటవెంటనే గర్భం ధరిస్తూ ఉంటే, రక్తహీనత (ఎనీమియా) వంటి వాటిని బారినపడతారు. రుతుస్రావం సమయంలో మహిళల హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మార్పుల ప్రభావం వారి ప్రవర్తన తీరుపై, శారీరక సామర్థ్యంపైనా ఉంటుంది. సెక్స్ విషయంలో ఆసక్తి పెరగొచ్చు, తగ్గొచ్చు.కాన్పు తర్వాత, పిల్లలకు పాలు పట్టేందుకు రాత్రంతా తల్లి మేల్కొని ఉండాల్సి వస్తూ ఉంటుంది. వారికి నిద్ర సరిగ్గా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి సెక్స్‌పై పెద్దగా ఆసక్తి ఉండదు. ఇక గర్భంతో ఉన్న సమయంలో అధిక స్థాయిల్లో ఉన్న హార్మోన్లు నెమ్మదిగా తగ్గిపోతాయి.
అందుకే, కొందరు మహిళలకు కాన్పు తర్వాత సెక్స్‌పై ఆసక్తి పోతుంది. ఇలాంటి వాటిని భర్త అర్థం చేసుకోవాలి. భార్యకు తోడ్పాటు అందించాలి. పిల్లల పోషణలో ఆమెకు సాయంగా ఉండాలి. హార్మోన్ మార్పుల వల్ల వచ్చే అలసట తగ్గేందుకు ఆమెకు విశ్రాంతి దొరికేలా చూడాలి'' అని వైద్యులు చెబతున్నారు. కాబట్టి భర్తలు అర్థం చేసుకొని .. భార్యలతో అణువైన సమయంలోనే శృంగారం చేయాలని వైద్యలు చెబుతున్నారు.